అతిలోకసుందరి శ్రీదేవికి(sri devi) అరుదైన ఘనతను అందుకున్నారు. దక్షిణాది చిత్రాలలో అగ్రనటిగా వెలుగొంది, అటు పిమ్మట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, అక్కడా టాప్ స్టార్ గా ఎదిగిన శ్రీదేవి అర్ధాంతరంగా కన్నుమూసిన విషయం విదితమే.
అతిలోకసుందరి శ్రీదేవికి(sri devi) అరుదైన ఘనతను అందుకున్నారు. దక్షిణాది చిత్రాలలో అగ్రనటిగా వెలుగొంది, అటు పిమ్మట బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, అక్కడా టాప్ స్టార్ గా ఎదిగిన శ్రీదేవి అర్ధాంతరంగా కన్నుమూసిన విషయం విదితమే. ఆమెకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఆ అభిమానాన్ని భిన్న రూపాలలో వ్యక్తపరుస్తున్నారు. ముంబాయిలోని అంధేరి(andheri) ప్రాంతంలో ఉన్న లోఖండ్‌వాలా కంప్లెక్స్‌లోని(Lokhandwala Complex) ఓ జంక్షన్‌కు అక్కడి ప్రజలు శ్రీదేవి కపూర్ చౌక్(Sridevi Kapoor Chowk) అని పేరు పెట్టారు. శ్రీదేవి, బోనీ కంపూర్ దంపతులు, వారి ఇద్దరు కూతుళ్లు జాన్వీ(Janhvi), ఖుషి(Kushi) కపూర్‌లు ఇంతకు ముందు ఇక్కడే ఉండేవారు. శ్రీదేవి చనిపోయిన తర్వాత బోనీ కపూర్ మరో చోటకు వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. జంక్షన్‌కు శ్రీదేవి కపూర్ అని పేరు పెట్టిన విషయాన్ని ముంబాయ్ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది