భద్రతాపరమైన కారణాలతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన విషయం తెలిసిందే.
భద్రతాపరమైన కారణాలతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన విషయం తెలిసిందే. వేడుక రద్దు కావడంతో ఎన్టీఆర్ అభిమానులు కోపంతోనూ, బాధతోనూ ఉన్నారు. ఈ క్రమంలో అభిమానుల కోసం ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. ఎక్స్ ద్వారా ఆయన ఫ్యాన్స్‌కు విన్నపాన్ని పంపారు. అందులో ఎన్టీఆర్ ఏమన్నారంటే.. 'దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం చాలా బాధగా ఉంది. ఎప్పుడు అవకాశం వచ్చినా మీతో సమయాన్ని గడపాలని, దేవర సినిమా గురించి, దానికోసం మేం పడిన కష్టం గురించి వివరించాలని ఆసక్తిగా ఎదురుచూశా. కానీ, భద్రతా పరమైన కారణాలతో వేడుక రద్దు చేయాల్సి వచ్చింది. మీకంటే నాకు ఎక్కువగా బాధగా ఉంది. ఫంక్షన్ క్యాన్సిల్ విషయంలో నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్స్‌ను తప్పు పట్టడం సరికాదు. మీ అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటా. ఈరోజు మనం కలవకపోయినా ఈ నెల 27న కలవబోతున్నాం. మీరంతా సినిమాని చూసి కాలర్ ఎగరేస్తారని నమ్మకంగా ఉన్నా. ఆ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. కొరటాల శివ ఎంతో కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారు. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం దేవరకు, నాకు చాలా అవసరం. మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి' అంటూ ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.