అంతా పుష్ప2 మ్యానియాలో ఉండగా.. నందమూరి ప్యాన్స్ కు గుడ్ న్యూస్ అందుతోంది.
అంతా పుష్ప2 మ్యానియాలో ఉండగా.. నందమూరి ప్యాన్స్ కు గుడ్ న్యూస్ అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ దేవర 100 డేస్ కంప్లీట్ చేసుకుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత నటించిన సినిమా దేవర. రీసెంట్ గా వచ్చి హిట్ కొట్టిన ఈసినిమా 1000 కోట్ల కలెక్షన్ మార్క్ ను మాత్రం అందుకోలేకపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ అలరించారు.
ఇక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా.. మిక్స్ టాక్ తో.. మంచి కలెక్షన్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఏకంగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 1000 కోట్లు క్రాస్ చేస్తుందని ఆశపడ్డా.. నిరాశే ఎదురయ్యింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు.
ఇక దేవర మూవీ 52 సెంటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుని మంచి రికార్డ్ ను ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈసందర్భంగా మూవీ టీమ్ 100 డేస్ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దేవర 100 రోజులు ఆరు సెంటర్స్ లో ఆడుతుందని ప్రకటించారు.
ఈ సినిమా ఏ ఏ సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకుందంటే.. ఈస్ట్ గోదావరి జిల్లాలోని మలికిపురం పద్మజ థియేటర్, మండపేట రాజారత్న థియేటర్, చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్, కొత్తకోట ద్వారకా థియేటర్, ఖమ్మం జిల్లా కల్లూరు MNR థియేటర్, రొంపిచర్ల MM డీలక్స్ థియేటర్ లలో దేవర సినిమా 100 డేస్ ఆడినట్టు ప్రకటించారు.
దేవర 100 డేస్ కంప్లీట్ చేసుకోవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అంతే కాదు ఈ 100 రోజుల స్పెషల్ పోస్టర్ ను వైరల్ అచేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈమూవీ నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. దేవర సినిమాకు పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. ఈమూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దేవర2ను భారీ ఎత్తున పక్కా ప్లాన్ తో రూపొందించబోతున్నారు టీమ్. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ 2 మూవీ చేస్తున్నాడు. ఈసినిమా తరువాత ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ కాబోతున్నాడు తారక్.