ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ(Koratala shiva) తో భారీ పాన్ ఇండియా సినిమా దేవర. ఆర్ఆర్ఆర్(RRR) తరువాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు కొరటాల.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ(Koratala shiva) తో భారీ పాన్ ఇండియా సినిమా దేవర. ఆర్ఆర్ఆర్(RRR) తరువాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు కొరటాల. ఇక ఈమూవీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ముందు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్న కొరటాల.. ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టకుండా.. సినిమా షూట్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు మూవీ టీమ్. అయిత ఈ సీక్వెన్ కాస్త రిస్క్ తో కూడుకున్నదని తెలుస్తోంది. అయినా సరే పర్ఫెక్ట్ గా చేస్తున్నారట టీమ్. దానికి సబంధించిన ఓ భారీ షెడ్యూల్ తాజాగా స్టార్ట్ అయ్యిందట.

ఇక ఈ షెడ్యూల్ యాక్షన్ షెడ్యూల్ కాగా ఇందులో ఎన్టీఆర్ సహా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Kahan) పై అయితే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లను హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఇప్పుడు అలాగే ఓ స్టన్నింగ్ సీక్వెన్స్ ని అయితే డిజైన్ చేశారట. అయితే ఈ విషయంలో అఫీషయల్ గా ఎవరూ చెప్పలేదు. సోషల్ మీదియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ.. శ్రీదేవి(Sridevi) తనయురాలు జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె సౌత్ ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ సంచలనం అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా యువసుధ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో కల్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Updated On 9 Jun 2023 11:25 PM GMT
Ehatv

Ehatv

Next Story