జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR) ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించేస్తారు. అది తాత సీనియర్‌ ఎన్టీఆర్‌(Sr.NTR) నుంచి అబ్బిన విద్య అయి ఉంటుంది. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలోనూ జూనియర్‌ ఎన్టీఆర్‌ అదరగొట్టేస్తారు. జై లవకుశ(Jai lava kusa) సినిమానే ఇందుకు నిదర్శనం. అందులో జై పాత్రలో విలన్‌గా విజృంభించేశారు ఎన్టీఆర్‌.

జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR) ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించేస్తారు. అది తాత సీనియర్‌ ఎన్టీఆర్‌(Sr.NTR) నుంచి అబ్బిన విద్య అయి ఉంటుంది. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలోనూ జూనియర్‌ ఎన్టీఆర్‌ అదరగొట్టేస్తారు. జై లవకుశ(Jai lava kusa) సినిమానే ఇందుకు నిదర్శనం. అందులో జై పాత్రలో విలన్‌గా విజృంభించేశారు ఎన్టీఆర్‌. పాజిటివ్‌ షేడ్స్‌ ఉన్న లవ, కుశ పాత్రల్లో హీరోయిజం చూపించారు ఎన్టీఆర్‌. ఇప్పుడు మరోసారి నెగటివ్‌ షేడ్‌ ఉన్న రోల్‌లో ఎన్టీఆర్‌ కనిపించబోతున్నారట. అది కూడా హిందీ సినిమాలో.

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌(Yash raj Films) స్పై ఫ్రాంచైజీలోని వార్(War) సినిమాకు సీక్వెల్‌గా వార్‌-2(War-2) తెరకెక్కిస్తున్నారు. ఇందులో హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) హీరో పాత్రలో కనిపిస్తారు. ఎన్టీఆర్‌ది విలన్‌ షేడ్ ఉన్న పాత్రనే అయినప్పటికీ ఇదే సినిమాలో ప్రధాన పాత్ర అని అంటున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రకు కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని, అలాగే ఆయన పాత్ర నెగటివ్‌గా ఎందుకు మారుతుంది? అనేదానికి ఓ బలమైన కారణం ఉండేలా అయాన్‌ ముఖర్జీ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారట! హీరోయిన్‌ల పాత్రల కోసం దీపికా పదుకోన్, శర్వరీ వాఘ్‌లను సంప్రదిస్తున్నారు మూవీ మేకర్స్‌. అత్యంత భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్‌.

Updated On 19 May 2023 1:45 AM GMT
Ehatv

Ehatv

Next Story