జూనియర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ఎన్టీఆర్30 చిత్రం షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. ఈ బిజీ షెడ్యూల్‏లో కూడా ఆయన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 (Pushpa2) సెట్స్‏కి వెళ్లేందుకు కాస్త టైమ్ కేటాయించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్‏కి ఎన్టీఆర్ వెళ్లారు. అయితే ఆయన సెట్స్‏కి వెళ్తుండగా క్యాప్చర్ చేసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ఎన్టీఆర్30 చిత్రం షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. ఈ బిజీ షెడ్యూల్‏లో కూడా ఆయన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 (Pushpa2) సెట్స్‏కి వెళ్లేందుకు కాస్త టైమ్ కేటాయించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్‏కి ఎన్టీఆర్ వెళ్లారు. అయితే ఆయన సెట్స్‏కి వెళ్తుండగా క్యాప్చర్ చేసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమా అల్లు అర్జున్‏ (Allu Arjun)కి సూపర్ హిట్ సినిమాగా నిలిచి బన్నీని ప్యాన్ ఇండియన్ స్టార్‏ని చేసింది. ఇండియన్స్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లెన్తీగా, ఇంట్రెస్టింగ్‏గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే పుష్ప సెట్స్‏కి ఎన్టీఆర్ సడన్‏గా ప్రత్యక్షమవడంతో ఏం జరిగిందని అభిమానులు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఫాన్స్‏లో ఓ కొత్త డౌట్ రైజ్ అయింది.

అదేంటంటే ఎన్టీఆర్ ఫ్రెండ్లీ విజిట్ చేశాడా లేక పుష్ప: ది రూల్‏లో ఏమైనా కనిపించే అవకాశాలు ఉన్నాయా అని ఆలోచనలో పడ్డారు. ఈ ఫొటోలు వైరల్ అవుతుంటే తారక్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ (James Gunn) కూడా ఎన్టీఆర్ తో పనిచేసే అవకాశం కోసం వేచి చూస్తున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ డైరెక్టర్ ఈ మాటలు అనడంతో ప్రధాన్యత సంతరించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఓ అద్భుతమైన యాక్టర్ అంటూ ఆయన మెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు, ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

Updated On 27 April 2023 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story