ఎంత పేరు సంపాదించిన దర్శకుడికైనా ఎత్తుపల్లాలు తప్పవు. తీసిన అన్ని సినిమాలు హిట్టవుతాయన్న గ్యారంటీ ఏమీ లేదు. విజయాలు సాధిస్తున్నప్పుడు అందరూ చుట్టూ చేరతారు. ఒక్క ఫ్లాప్‌ పడిందంటే చాలు ఎవరూ పలకరించరు. సినిమా ఇండస్ట్రీలో ఇది సర్వ సాధారణం. ఫ్లాప్‌ను చవిచూసిన దర్శకుడు కోసం ఏ నిర్మాత ప్రయత్నించడు.

ఎంత పేరు సంపాదించిన దర్శకుడికైనా ఎత్తుపల్లాలు తప్పవు. తీసిన అన్ని సినిమాలు హిట్టవుతాయన్న గ్యారంటీ ఏమీ లేదు. విజయాలు సాధిస్తున్నప్పుడు అందరూ చుట్టూ చేరతారు. ఒక్క ఫ్లాప్‌ పడిందంటే చాలు ఎవరూ పలకరించరు. సినిమా ఇండస్ట్రీలో ఇది సర్వ సాధారణం. ఫ్లాప్‌ను చవిచూసిన దర్శకుడు కోసం ఏ నిర్మాత ప్రయత్నించడు. ఇలాంటి సమయంలో చేయి అందించే హీరో ఎవరైనా ఉంటే బాగుండని దర్శకులు అనుకుంటుంటారు.

కానీ ఆ దశలో ఏ స్టార్‌ హీరో కూడా వీరి కథ వినడానికి ఇంట్రెస్ట్‌ చూపరు. పోనీ లోబడ్జెట్ సినిమాలు తీద్దామంటే మనసొప్పదు. ఇలాంటి పరిస్థితి ఎదురైన దర్శకులు ఎందరో ఉన్నారు. అయితే త్రివిక్రమ్‌(Trivikram) శ్రీనివాస్‌, కొరటాల శివలకు(Koratala shiva) భయంకరమైన ఫ్లాప్‌లు పడ్డాయి. అయితే వారు ఎక్కువ కాలం ఎదురు చూడకుండా ఎన్టీఆర్‌(NTR) వంటి అగ్రహీరోతో సినిమాలు తీశారు. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు.అయిదేళ్ల కిందట త్రివిక్రమ్‌-పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి(Agnathavasi) అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.

త్రివిక్రమ్‌ కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్‌. అప్పటి వరకు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఈ సినిమాతో మటాష్‌. త్రివిక్రమ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు ఎన్టీఆర్‌ ఆయనకు భరోసా ఇచ్చాడు. టెన్షనేమీ వద్దు, ఇదే ఏడాది బ్రహ్మండమైన హిట్‌ కొడదామని ప్రోత్సహించాడు. చెప్పినట్టుగానే అరవింద సమేత వీర రాఘవతో(Arvindha sametha) త్రివిక్రమ్‌కు విజయవంతమైన సినిమాను ఇచ్చాడు ఎన్టీఆర్‌.

అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల శివకు లాస్టియర్‌ గట్టి దెబ్బ తగిలింది. మెగాస్టార్‌ హీరోగా వచ్చిన ఆచార్య(Aacharya) సినిమా బాక్సాఫీసు దగ్గర తుస్సుమంది. మెగాస్టార్‌ను, మెగావారసుడిని ఒకే స్క్రీన్‌పై చూపిస్తే బాక్సులు బద్దలవుతాయని కొరటాల అనుకున్నాడు. కానీ ప్రేక్షకులు తిప్పికొట్టారు. అంత బండల్‌ సినిమా తీసిన ఏ దర్శకుడికైనా కొంత గ్యాప్‌ వస్తుంది.

కానీ కొరటాల శివకు ఎన్టీఆర్‌ ధైర్యమిచ్చాడు. దేవర(Devara) సినిమాను మొదలు పెట్టాడు. ఇచ్చిన అవకాశాన్ని నిలుపుకోవడానికి కొరటాల కూడా గట్టిగా కృషి చేస్తున్నాడు. భారతీయ సినిమా చరిత్రలో నభూతో న భవిష్యత్‌ అన్న రేంజ్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చూపించబోతున్నాడట. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్యాన్‌ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ఎన్టీఆర్‌ ఆర్స్ట్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated On 4 Oct 2023 1:37 AM GMT
Ehatv

Ehatv

Next Story