నందమూరి బాలకృష్ణకు(Nandamuri Balakrishna), జూనియర్ ఎన్టీఆర్‌కు(Jr NTR)మధ్య పూడ్చుకోలేని అగాధం ఏర్పడింది.
నందమూరి బాలకృష్ణకు(Nandamuri Balakrishna), జూనియర్ ఎన్టీఆర్‌కు(Jr NTR)మధ్య పూడ్చుకోలేని అగాధం ఏర్పడింది. ఈ గ్యాప్‌కు కారణం బాలకృష్ణనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాపం ఎన్టీఆరే బాబాయ్ బాబాయ్ అంటూ అభిమానాన్ని వ్యక్తపరిచాడు కానీ బాలయ్యే పట్టించుకోలేదు. బాలయ్యతో పాటు తమ్మడు కల్యాణ్‌రామ్(Kalyan Ram)ను కూడా దూరం పెట్టేసింది నందమూరి ఫ్యామిలీ. ఎంతైనా అన్న హరికృష్ణ(HariKrishna)కొడుకులే కదా! కొన్నేళ్లుగా ఎన్టీఆర్‌ను ఏ కార్యక్రమానికి పిలవడం లేదు. ఎన్టీఆర్ టాప్ స్టార్ అయ్యాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు దేఖనే దేఖేవారు కాదు! 2009 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ (TDP)విజయం కోసం ఊరూరా తిరిగాడు ఎన్టీఆర్. విపరీతంగా ప్రచారం చేశాడు. ఏమైంది? ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ ఊసే ఎత్తడం మానేసింది టీడీపీ. బాలకృష్ణ కూడా అంతే! అతడి అన్‌స్టాపబుల్ షోకు టాలీవుడ్‌లో ఆల్‌మోస్టాల్ అందరి హీరోలను పిలిచి ఇంటర్వ్యూలు చేశాడు. ఒక్క ఎన్టీఆర్‌ను తప్ప. అలాగే బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు కూడా ఎన్టీఆర్‌కు పిలుపు వెళ్లలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ ప్లేస్‌లో ఎవరున్నా ఇప్పుడు చంద్రబాబు(Chandrababu) దగ్గరకు చేతులు కట్టుకుని వెళ్లేవారు. బాలయ్య బాబుకు సరేండర్ అయ్యేవారు. కానీ ఎన్టీఆర్ అలా కాదు. పట్టుదలలో తాత సీనియర్ ఎన్టీఆర్ లక్షణాలే వచ్చాయి. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున(Nagarjuna), అల్లు అర్జున్(Allu Arjun), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), నాని(Nani) వంటి వారికి ఆహ్వాన పత్రికలు వెళ్లాయి. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను మాత్రం పిలవలేదు. పిలిచినా వెళ్లేవారు కాదేమో! ఎందుకంటే అతడు ఎన్టీఆర్ కాబట్టి! లొంగిపోయే మనస్తత్వం అతడికి కాదు కాబట్టి!