వెట్రిమారన్‌(Vetri maaran) అద్భుతమైన దర్శకుడంటూ ప్రత్యేకంగా కితాబు ఇవ్వాల్సిన అవసరంలేదు.

వెట్రిమారన్‌(Vetri maaran) అద్భుతమైన దర్శకుడంటూ ప్రత్యేకంగా కితాబు ఇవ్వాల్సిన అవసరంలేదు. ఆయన రూపొందించిన సినిమాలు ఆయనెంత గొప్పదర్శకుడో చెబుతాయి. ఆయనతో సినిమా చేయడానికి స్టార్‌ హీరోలు కూడా ఉవ్విళ్లూరుతారు. అలాంటివారిలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒకరు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రమోషన్‌ల సమయంలోనే ఎన్టీఆర్‌ ఈ విషయం చెప్పుకొచ్చారు. టాప్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌తో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయబోతున్నారంటూ ఆ మధ్య తెగ ప్రచారం కూడా జరిగింది.

తాజాగా మరోసారి ఎన్టీఆర్(NTR)​ వెట్రిమారన్​పై తనకున్న అభిమానాన్ని చూపారు. దేవర(Devara) సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెన్నైకు వెళ్లిన ఎన్టీఆర్‌కు ప్రెస్‌ నుంచి ఈ ప్రశ్నే వచ్చింది. 'తమిళంలో సినిమా ఎప్పుడు చేయనున్నారు' అని రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్‌ స్పందించారు. "నా ఫేవరెట్ డైరెక్టర్​ వెట్రిమారన్‌. ఆయన ఎప్పుడు నాతో సినిమా తీస్తే అప్పుడు డైరెక్ట్​గా తమిళంలో నటిస్తాను" అని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్​ అటు తమిళ ఇండస్ట్రీలో ఇటు ఎన్టీఆర్‌ అభిమానుల్లో వైరల్​గా మారాయి. త్వరగా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని అందరూ కామెంట్లు చేస్తున్నారు.

సూరి ప్రధాన పాత్రలో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో విడుదల అనే సినిమా రూపొందించారు వెట్రిమారన్. త్వరలో ఈ సినిమా రెండో భాగం కూడా విడుదల కాబోతున్నది. విడుదల ప్రమోషన్స్‌లో భాగంగా అప్పట్లో వెట్రిమారన్‌ హైదరాబాద్‌కు వచ్చారు.

అప్పుడు ఎన్టీఆర్​తో సినిమా గురించి వెట్రిమారన్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. అప్పుడు తాను ఎన్టీఆర్​ను కలిశానని, కానీ కొన్ని కారణాల వల్ల సినిమా కుదరలేదని వివరించారు. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story