టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh shobhan), మాళవిక నాయర్(Malavika Nair) జంటగా.. హిట్ సినిమాల మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన సినిమా అన్నీమంచి శకునములే(ani manchi shakunamule). వైజయంతీ మూవీస్ బ్యానర్(Vaijayanthi movies banner) పై స్వప్న దత్(Swapna dat) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Jr. NTR And Santhosh shobhan
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh shobhan), మాళవిక నాయర్(Malavika Nair) జంటగా.. హిట్ సినిమాల మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన సినిమా అన్నీమంచి శకునములే(ani manchi shakunamule). వైజయంతీ మూవీస్ బ్యానర్(Vyjayanthi movies banner) పై స్వప్న దత్(Swapna dat) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ వీడియోస్ తో పాటు.. రిలీజైన సాంగ్స్, టీజర్ ఆడియన్స్ మనసు దోచాయి. ఇక తాజాగా ఈసినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు టీమ్. అది కూడా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR) చేతుల మీదుగా ఈమూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్.
ఈ ట్రైలర్ ను గ్లోబల్ స్టార్.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేధికగా రిలీజ్ చేశారు. అన్నిమంచి శకునములే ట్రైలర్‌ని.. తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఎన్టీఆర్ ఈ విధంగా నోట్ రాశారు. అన్నీ మంచి శకునములే మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటూ.. మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు కొత్త కథలు, సృజనాత్మక సినిమాలు రూపొందించడంలో.. నా స్నేహితురాలు స్వప్నకు మంచి అనుభవం ఉంది. ప్రియాంక ఎంచుకున్న కథ.. డైరెక్టర్ గా నందినీ రెడ్డిగారి ప్రతిభకు.. ఆల్ ది బెస్ట్ అంటూ.. హీరో హీరోయిన్లకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
తన ట్వీట్ కు అన్నిమంచి శకునములే మూవీ ట్రైలర్ లింక్ ను జతచేశారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ ట్వీట్ తో పాటు.. ఈ మూవీ ట్రైలర్ కూడా దూసుకుపోతోంది. ఇక సరిగ్గా ఈరోజు టైమ్ కు తారక్ ఈ ట్రైలర్ రిలీజ్ చేయడంతో... తారక్ హ్యాండ్ పడితే..నిజంగా మంచి శకునములే సంతోష్ హిట్ అందుకున్నట్లే అని అభిమానులు హామీ ఇస్తున్నారు. ఇక ఎన్నో అంచనాల నడుమ అన్ని మంచి శకునములే సినిమా మే 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మరి ఈసినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
ప్రస్తుత తన 30 వ సినిమా చేస్తున్నాడు తారక్. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్ ఈమూవీలో ఎన్టీఆర్ సరసన నటిస్తుండగా.. ఈమూవీతో ఆమె సౌత్ ఎంట్రీ ఇస్తోంది. ఇక సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కు విలన్ గా నటిస్తున్నాడు. ఈసినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు తారక్. మరికొన్ని కథలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.
