జపాన్‌(Japan)లో చోటు చేసుకున్న వరుస భూకంపాలపై (earthquakes)ఎన్టీఆర్‌(NTR) తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గతవారం రోజులుగా అక్కడే ఉన్నానని చెబుతున్న ఎన్టీఆర్‌ సోమవారమే హైదరాబాద్‌(Hyderabad)కు వచ్చారు. జపాన్‌లో వారం రోజుల పాటు దేవర (Devara)సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.

జపాన్‌(Japan)లో చోటు చేసుకున్న వరుస భూకంపాలపై (earthquakes)ఎన్టీఆర్‌(NTR) తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గతవారం రోజులుగా అక్కడే ఉన్నానని చెబుతున్న ఎన్టీఆర్‌ సోమవారమే హైదరాబాద్‌(Hyderabad)కు వచ్చారు. జపాన్‌లో వారం రోజుల పాటు దేవర (Devara)సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరించిన ప్రాంతంలో భూకంపం రావడం తన హృదయాన్ని కలచి వేసిందని, భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలు త్వరగా కోలుకోవాలని, ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్‌ తెలిపారు. 'జపాన్ నుంచి ఈరోజే ఇంటికి తిరిగి వచ్చా. అక్కడ భూకంపం వచ్చింది అని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి (deeply shocked )గురయ్యాను. నేను వారం రోజులుగా అక్కడే ఉన్నా. ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటున్నా. కష్ట సమయంలో జపాన్ ప్రజల ధైర్యానికి కృతజ్ఞతలు. ఈ విపత్తు నుంచి జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ఎన్టీఆర్‌.

Updated On 2 Jan 2024 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story