సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణను

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జూన్‌కు వాయిదా వేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 600 చదరపు గజాల స్థలం యాజమాన్యంపై డెట్ రికవరీ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. ఏప్రిల్ 30న జారీ చేసిన DRT ఉత్తర్వును పక్కనపెట్టి, రికార్డులను పిలవాలని ఆదేశించాలని కోరుతూ ఎన్టీఆర్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ కె. రాజేశ్వర్ రావు ద్వారా రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం చెలరేగింది. 2003లో సుంకు గీత నుండి ఎన్టీఆర్ ప్లాట్ కొన్నారు. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా సుంకు గీత కుటుంబం లోన్స్ పొందింది. ఐదు బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ పొందిన విషయాన్ని దాచిపెట్టారు. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు తెలిపారు. చెన్నై లో తారక్ ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు. 2003 నుండి ప్లాట్ ఓనర్ గా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నారు. అప్పటి నుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతూ వస్తోంది. ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. తాజాగా DRT లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో.. జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు కోరింది. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated On 16 May 2024 11:05 PM GMT
Yagnik

Yagnik

Next Story