ఎన్టీఆర్(Jr.NTR) సినిమా రాక ఏడాది దాటింది. ఆర్ఆర్‌ఆర్‌(RRR) తర్వాత ఎన్టీఆర్‌ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా సినిమాలకే మొదటి ప్రాధాన్యమిస్తున్నాడు. ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా ఎన్టీఆర్‌ మాత్రం నటనవైపే మొగ్గుచూపుతున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా దేవర(Devara). దీనికి కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు.

ఎన్టీఆర్(Jr.NTR) సినిమా రాక ఏడాది దాటింది. ఆర్ఆర్‌ఆర్‌(RRR) తర్వాత ఎన్టీఆర్‌ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా సినిమాలకే మొదటి ప్రాధాన్యమిస్తున్నాడు. ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా ఎన్టీఆర్‌ మాత్రం నటనవైపే మొగ్గుచూపుతున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా దేవర(Devara). దీనికి కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. రాజమౌళి సినిమా చేసిన తర్వాత హీరోలకు ఆ తర్వాత సినిమా అంతగా అచ్చిరాదు. ఇప్పటి వరకు అలాగే జరగడంతో హీరోలకు ఇదో సెంటిమెంట్‌గా మారింది. అయితే దీన్ని బ్రేక్‌ చేయాలనే పట్టుదలతో ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ గండం నుంచి బయటపడాలనే కసితో ఉన్నాడు. దర్శకుడు కొరటాల శివ కూడా దేవరగా ముందెప్పుడూ చూడని సరికొత్త ఎన్టీఆర్‌ను తెరపై చూపించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అందుకోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ తర్వాతి సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేవర తర్వాత ఎన్టీఆర్‌ కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) డైరెక్షన్‌లో నటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్‌ మరో డైరెక్టర్‌కు ఓకే చెప్పారట! ఆ డైరెక్టర్‌ ఇప్పటి వరకు చేసినవి రెండంటే రెండే సినిమాలు. ఆయనెవరంటే రాహుల్ సాంకృత్యాన్‌(Rahul Sankrityan). విజయ్‌ దేవరకొండతో టాక్సీవాలా, నేచురల్ స్టార్‌ నానితో శ్యామ్‌సింగరాయ్‌ సినిమాలతో రాహుల్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ కోసం మంచి పీరియాడికల్‌(Periodical) సబ్జెక్ట్‌ను సిద్ధం చేశారని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న మాట! ఎన్టీఆర్‌కు ఆ కథ బాగా నచ్చిందట! కథ విన్న వింటనే సినిమా చేయాలని ఎన్టీఆర్‌ డిసైడయ్యారట! మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నదట!

Updated On 14 Sep 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story