ఆర్‌ఆర్ఆర్(RRR) సినిమాతో ఎన్టీఆర్(NTR) ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్(Pan India Star)గా మారిపోయాడు. ఇండియాలో ఇప్పుడు ఎన్టీఆర్ అంటే తెలియని వారు తక్కువే! రాజమౌళి(Rajamouli) డైరెక్ట్ చేసిన ట్రిపులార్ మూవీలోని నాటు నాటు పాట(Natu Natu Song)కు ఆస్కార్ అవార్డు(Oscar Award) కూడా రావడంతో ట్రిపులార్ మూవీ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు గ్లోబల్ స్టార్లయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్న సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది.

Jr NTR War-2 Remuneration
ఆర్‌ఆర్ఆర్(RRR) సినిమాతో ఎన్టీఆర్(NTR) ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్(Pan India Star)గా మారిపోయాడు. ఇండియాలో ఇప్పుడు ఎన్టీఆర్ అంటే తెలియని వారు తక్కువే! రాజమౌళి(Rajamouli) డైరెక్ట్ చేసిన ట్రిపులార్ మూవీలోని నాటు నాటు పాట(Natu Natu Song)కు ఆస్కార్ అవార్డు(Oscar Award) కూడా రావడంతో ట్రిపులార్ మూవీ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు గ్లోబల్ స్టార్లయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్న సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్వీ కపూర్‌కు ఇదే తొలి తెలుగు సినిమా కావడం గమనార్హం. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఓ బాలీవుడ్ సినిమాకు కూడా సైన్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan నటిస్తున్న వార్-2లో ఎన్టీఆర్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. హృతిక్‌తో సరిసమానంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమాపై అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఈ సినిమాకు ఎన్టీఆర్ తీసుకుంటున్న పారితోషికంపై కూడా చర్చ మొదలయ్యింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 40 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఎన్టీఆర్ వార్-2 సినిమా కోసం వంద కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట! ట్రిపులార్‌లో నటించినందుకు ఎన్టీఆర్ తీసుకున్న పారితోషికం 45 కోట్ల రూపాయలే అన్న విషయం మర్చిపోకూడదు. ఇప్పటికే చాలా మంది సౌతిండియా స్టార్లు వంద కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్, అజిత్‌కుమార్‌లు ఒక్కో చిత్రానికి వంద కోట్ల రూపాయలకు పైనే తీసుకుంటున్నారు. ఇక రజనీకాంత్ విషయం చెప్పనే అక్కర్లేదు.. ఇప్పుడు వారి సరసన ఎన్టీఆర్ చేరారు.
