తాత ఎన్టీఆర్‌లాగే(ntr) తారక్ కూడా మంచి భోజనప్రియుడు.
తాత ఎన్టీఆర్‌లాగే(ntr) తారక్ కూడా మంచి భోజనప్రియుడు. స్టార్ హీరో అయ్యాక ఇప్పుడు కాసింత కంట్రోల్ చేసుకుంటున్నాడు కానీ ఒకప్పుడు అయితే తిండి దగ్గర మొహమాటపడేవాడు కాదు. బావర్చీ బిర్యానీ(Bavarchi) ఫ్యామిలీ ప్యాక్ మొత్తం ఒక్కడే తినేసేవాడట! ఈ విషయాన్ని ఎన్టీఆరే స్వయంగా చెప్పాడు. లేటెస్ట్‌గా దేవర ప్రమోషన్స్‌లో తమిళనాడు(Tamilnadu) ఫేమస్ బిర్యానీ(Biryani) గురించి మాట్లాడాడు ఎన్టీఆర్. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత సోలోగా ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే. మధ్యలో ఆర్‌ఆర్‌ఆర్ వచ్చిందనుకోండి. దేవర ఈ నెల 27వ తేదీన విడుదలకానుంది. పాన్ ఇండియా లెవల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ దేశమంతా తిరిగేస్తున్నది. ఎన్టీఆర్ కూడా దేశంలోని వివిధ నగరాలకు వెళుతున్నాడు. మొన్నామధ్య ట్రైలర్ లాంచ్ కోసం ముంబాయికి వెళ్లాడు తారక్. అలాగే మంగళవారం సాయంత్రం చెన్నైలో ల్యాండ్ అయ్యాడు. మీడియాతో కాసేపు మాట్లాడాడు. తర్వాత జరిగిన ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ను యాంకర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. మధ్యలో ఎన్టీఆర్ 'మీరు నా ప్లాన్ అంతా నాశనం చేస్తున్నారు. నేను వెళ్లేటప్పుడు దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ ప్యాక్ తీసుకెళ్దామనుకున్నాను. కానీ మీ వల్ల అది మిస్ అయిపోద్దేమో! దేవర రిలీజ్ తర్వాత మనం ఇద్దరం వెళ్లి తిందాం' అని యాంకర్‌తో ఎన్టీఆర్ చెప్పాడు. దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ చాలా ఫేమస్. మన దగ్గర దబ్ బిర్యానీలాగే! 1957 నుంచి దీన్ని తయారు చేసి అమ్ముతున్నారు. దీన్ని చిట్టిముత్యాల బియ్యంతో చేస్తారు. బిర్యానీ అని అంటారు గానీ పలావ్లా ఉంటుంది.