జూనియర్ ఎన్టీఆర్ (NTR)నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్‏లో జరుపుకుంటోంది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala siva) కాంబినేషన్‏లో వస్తున్న రెండో సినిమా ఎన్టీఆర్30. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత రెండు రోజుల నుంచి మేకర్స్ పోస్టర్, టైటిల్ గురించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

అయితే ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‏తోపాటు టైటిల్‏ను విడుదల చేశారు. ఈ పోస్టర్‏లో హీరో బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగితో సముద్రం ఒడ్డున బండల మీద నిల్చుని ఉండగా చుట్టూ శవాలతోపాటు రక్తం, వాటర్ కలిసిన పడవ పైకి లేచినట్టు చూపించారు. ఈ ఫస్ట్ లుక్‏లో ఎన్టీఆర్ మెడలో టవల్ వేసుకుని.. చేతిలో భారీ ఆయుధాన్ని పట్టుకుని ఉన్నారు. ఈ పవర్ ఫుల్ టైటిల్ దేవర (Devara) ఇప్పుడు అంచనాలను పెంచేస్తుంది. టైటిల్‏ను జస్టిఫై చేస్తూ.. అందరిలో భయం పుట్టించేలా ఉండేలా ఎన్టీఆర్ ఉగ్రరూపంలో ఉన్నారు.

బ్లడ్‏తో ఎన్టీఆర్ మాస్ లుక్‏లో కనిపిస్తుండటంతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో పేరున్న టెక్నిషీయన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు.

Updated On 19 May 2023 11:34 PM GMT
Ehatv

Ehatv

Next Story