నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. NTR30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక RRR తరువాత గ్లోబల్ స్టార్(global star) గా ఎదిగిన ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో.. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. NTR30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక RRR తరువాత గ్లోబల్ స్టార్(global star) గా ఎదిగిన ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో.. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

కొరటాల శివ(Koratala shiva) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా వీరి కాంబోలో రెండోవది. గతంలో ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్(Janatha garage) సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమా అందించాడు కొరటాల. ఈసారి పాన్ ఇండియా సినిమాతో.. పక్కా ప్లాన్ తో రాబోతున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా, సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్ట్ గా వర్క్ చేస్తున్న NTR30లోని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని పనిచేస్తున్నారు.

అనౌన్స్ చేసి కాలం అవుతున్నా.. షూటింగ్ మొదలు పెట్టుకోవడంలో లేట్ చేసినా.. షూటింగ్ షెడ్యూల్స్ మాత్రం సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు టీమ్. కోరటాల ముందే అన్నీరెడీ చేసుకుని పెట్టుకున్నట్టున్నాడు.. అందుకే షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ కు సబంధించి ఓ విషయన్ని వెల్లడించారు డీఓపీ రత్నవేలు(DOP Rathnavelu).

రీసెంట్ గా ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ పూర్తి అయ్యినట్లు వెల్లడించాడు. ఈసినిమాలో ఎన్టీఆర్ పై పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని ఈ షెడ్యూల్ లో పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. ఈసినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ కొత్తగా ఉంటుందని.. ఆయన స్టూల్ మెస్మరైజ్ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఇక ఇప్పుడు జరిగిన సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లోనే.. ఈమూవీ విలన్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుసబంధించిన మేజర్ షూటింగ్ జరిగినట్టు ఆయన వెల్లడించారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై ఈసినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

Updated On 2 May 2023 11:59 PM GMT
rj sanju

rj sanju

Next Story