తనతో సినిమాచేయబోతున్న ప్రశాంత్ నీల్ కోసం సర్ ప్రైజింగ్ గిఫ్ట్ పంపించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సలర్ డైరెక్టర్ షాక్ అయ్యేలా తారక్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ ఏం పంపించాడంటే..? కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. నిజానికి మన తెలుగు వాడు అయిన ప్రశాంత్.. కన్నడ ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. లో బడ్డెజ్ సినిమాలతో నెట్టుకోస్తున్న కన్నడ పరిశ్రమకు వెయ్యికోట్ల సినిమాను పరిచయం చేశాడు.

తనతో సినిమాచేయబోతున్న ప్రశాంత్ నీల్ కోసం సర్ ప్రైజింగ్ గిఫ్ట్ పంపించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సలర్ డైరెక్టర్ షాక్ అయ్యేలా తారక్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ ఏం పంపించాడంటే..?

కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. నిజానికి మన తెలుగు వాడు అయిన ప్రశాంత్.. కన్నడ ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. లో బడ్డెజ్ సినిమాలతో నెట్టుకోస్తున్న కన్నడ పరిశ్రమకు వెయ్యికోట్ల సినిమాను పరిచయం చేశాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా బిజీలో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ బర్త్ డే.. ఈ ఆదివారం గనంగా జరిగింది. ఎంత మంది స్టార్లు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. ఇక ప్రభాస్ సలార్ సెట్లో శనివారం అర్థ రాత్రి ప్రశాంత్ పుట్టన రోజును ఘనంగా సెలబ్రేట్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

ఇక టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలయిన.. రామ్ చరణ్, తారక్ లు కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ ను తెలియజేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి.. ప్రశాంత్ నీల్ కోసం ఏకంగా నాటు కోడి పులుసు పంపించి బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ కాని.. ఎన్టీఆర్ కాని వెల్లడించలేదు కాని.. ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. థాంక్యూ అన్నయ్య అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.

ప్రశాంత్ నీల్ తో చాలా కాలంగా ఎన్టీఆర్ కు స్నేహం కుదిరింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చేఏడాది మార్చిలో పాన్ ఇండియా మూవీ స్టార్ట్ కాబోతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉండగా... అటు ఎన్టీఆర్ మాత్రం కొరటా శివతో .. దేవర సినిమా బిజీలో ఉన్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ కు విశేష స్పందన వచ్చింది. రగ్గుడ్ లుక్ లో ఎన్టీఆర్ ని చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.

Updated On 5 Jun 2023 2:45 AM GMT
Ehatv

Ehatv

Next Story