అత్యుత్సాహం పనికిరాదని పెద్దలు చెప్పిన విషయం జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR) ఫ్యాన్స్‌కు తెలియదు కాబోలు.. అందుకే ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. మొన్న జూనియన్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు జరిగింది కదా! ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సింహాద్రి(Simhadri) అనే సినిమా రీ రిలీజ్‌ చేశారు కదా! అలా సింహాద్రి సినిమా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సిరి వెంకట్‌(Siri Venkat), సిరికృష్ణ(Siri Krishna) అనే రెండు థియేటర్‌లో రీ రిలీజ్‌ అయ్యింది.

అత్యుత్సాహం పనికిరాదని పెద్దలు చెప్పిన విషయం జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr.NTR) ఫ్యాన్స్‌కు తెలియదు కాబోలు.. అందుకే ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. మొన్న జూనియన్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు జరిగింది కదా! ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సింహాద్రి(Simhadri) అనే సినిమా రీ రిలీజ్‌ చేశారు కదా! అలా సింహాద్రి సినిమా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సిరి వెంకట్‌(Siri Venkat), సిరికృష్ణ(Siri Krishna) అనే రెండు థియేటర్‌లో రీ రిలీజ్‌ అయ్యింది. తమ అభిమాన నటుడి సినిమా చూసి రాకుండా ఫ్యాన్స్‌ రెండు మేకలను వేట కొడవళ్లతో నరికి వాటి రక్తాన్ని ఎన్టీఆర్‌ ఫ్లెక్సీపై చిందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.

ఇది చూసిన తర్వాత పోలీసులు ఊరుకోరు కదా! తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. మరణాయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నది అభియోగం. ఇక్కడే కాదు సింహాద్రి రీ రిలీజ్‌ రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ చాలా చోట్ల రచ్చరచ్చ చేశారు. వెస్ట్‌ లండన్‌లోని(west London) ఓ థియేటర్‌లో అయితే బాణాసంచా(Fire Works) కాల్చారు. వాటి నుంచి నిప్పురవ్వలు ఎగిసి తెరపై పడ్డాయి. దాంతో మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. తలో దిక్కుగా పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Updated On 23 May 2023 3:02 AM GMT
Ehatv

Ehatv

Next Story