సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023(SIIMA 2023) వేడుక దుబాయ్‌లో జరుగుతోంది. సైమాగా పిల్చుకునే ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఈసారి జూనియర్‌ ఎన్టీఆర్‌కు(Junior NTR) దక్కింది. RRR చిత్రంలో ఆయన నటించిన కొమురం భీమ్‌ పాత్రకు ఈ అవార్డు లభించింది. అవార్డును అందుకున్న ఎన్టీఆర్‌ స్టేజ్‌పైన​ భావోద్వేగాలకు లోనయ్యారు.. మరోసారి అభిమానులపై తనకున్న ప్రేమను తారక్‌ చాటుకున్నారు. అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ ఎమోషనల్‌ అయ్యారు. కొమరం

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023(SIIMA 2023) వేడుక దుబాయ్‌లో జరుగుతోంది. సైమాగా పిల్చుకునే ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఈసారి జూనియర్‌ ఎన్టీఆర్‌కు(Jr.NTR) దక్కింది. RRR చిత్రంలో ఆయన నటించిన కొమురం భీమ్‌ పాత్రకు ఈ అవార్డు లభించింది. అవార్డును అందుకున్న ఎన్టీఆర్‌ స్టేజ్‌పైన​ భావోద్వేగాలకు లోనయ్యారు.. మరోసారి అభిమానులపై తనకున్న ప్రేమను తారక్‌ చాటుకున్నారు. అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ ఎమోషనల్‌ అయ్యారు. కొమరం భీమ్ పాత్ర కోసం నేను న్యాయం చేస్తానని తనను మళ్ళీ మళ్ళీ మళ్లీ నమ్మినందుకు జక్కన్నకు థాంక్స్ చెప్పుకున్నారు ఎన్టీఆర్‌. ఇంకా ఆయన ఏమన్నారంటే 'నా కో స్టార్​, మై బ్రదర్​, మై ఫ్రెండ్​ రామ్ చరణ్(Ram Charan)​కు నా ప్రత్యేక ధన్యవాదాలు. నా అభిమానులందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. వారందరికీ నా కృతజ్ఞతలు. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు. నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా బాధ పడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు నా అభిమాన సోదరులు అందరికీ తలవంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను' అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర సినిమాలో నటిస్తున్నారు. జనతా గ్యారేజ్ లాంటి సూపర్‌హిట్‌ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్​లో తెరకెక్కుతున్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ వేగంగా జరుపుకుంటోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.

Updated On 16 Sep 2023 2:34 AM GMT
Ehatv

Ehatv

Next Story