గ్లొబల్ స్టార్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR) హీరోగా.. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీగా.. సౌత్ సినిమాకు పరిచయం అవుతూ.. తెరకెక్కుతోన్న సినిమా దేవర. ఈమూవీ షూటింగ్ శరవేంగంగా జరుగుతోంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌(RRR) తో గ్లోబల్ ఇమేజ్ సాధించిన ఎన్టీఆర్.. తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు. ఆస్కార్(Oscar) సాధించిన తరువాత తారక్‌ నుంచి సినిమా రాలేదు.

గ్లొబల్ స్టార్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR) హీరోగా.. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీగా.. సౌత్ సినిమాకు పరిచయం అవుతూ.. తెరకెక్కుతోన్న సినిమా దేవర. ఈమూవీ షూటింగ్ శరవేంగంగా జరుగుతోంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌(RRR) తో గ్లోబల్ ఇమేజ్ సాధించిన ఎన్టీఆర్.. తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు. ఆస్కార్(Oscar) సాధించిన తరువాత తారక్‌ నుంచి సినిమా రాలేదు. పైగా రాజమౌళీ సినిమా తర్వాత సినిమా అంటే, ఎంత జాగ్రత్తగా చేస్తోనో అది వర్కౌట్ అవతుుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ చేసిన ఆచార్య పరిస్థితి అందరికి తెలిసిందే. ఇక ఆచార్యను డైరెక్ట్ చేసిన కొరటాల శివనే(Koratala Shiva).. ఇటు తారక్ తో దేవర సినిమా చేస్తున్నాడు.

ఓ విధంగా దర్శకుడికి ఇది సవాల్‌. కొరటాల శివకైతే చాలా పెద్ద సవాల్‌ అని చెప్పాలి. . అందుకే కసితో తెరకెక్కిస్తున్నాడు ‘దేవర’ను. హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని(Janhvi Kapoor), విలన్‌గా సైఫ్‌ ఆలీఖాన్‌ని(Saif Ali Khan) తీసుకున్నాడు. యాక్షన్‌ సన్నివేశాల కోసం హాలీవుడ్‌ నుంచి ఫైట్‌ మాస్టర్లను దింపాడు. తారక్‌తో ప్రమాదకరమైన విన్యాసాలే చేయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఇటు ఎన్టీఆర్ కూడా ఏమాత్రం తగ్గకుండా.. సినిమా కోసం కష్టపడుతున్నాడట. డూపు(Dupe) లేకుండా యాక్షన్ సీన్స్ చేస్తున్నాడని సమాచారం. దేవర(Devara) టీమ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. కథ రాసున్న కప్రకారం ఇందులో అండర్‌వాటర్‌లో ఫైట్‌ ఉంటుందట. దానికోసం రోజుల తరబడి శిక్షణ కూడా తీసుకున్నాడట తారక్‌. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌ కానున్నాయని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. తారక్‌, జాన్వీల మధ్య కీలక సన్నివేశాలను కొరటాల తెరకెక్కిస్తున్నారు. గోవాలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతండగా.. తరువాత షెక్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారట. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’ తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌5న విడుదల కానుంది.

Updated On 6 Nov 2023 8:39 AM GMT
Ehatv

Ehatv

Next Story