హీరో వరుణ్ తేజ్(Varun Tej)-హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) ఎనిమిదేళ్ల ప్రేమ పెళ్లితో మరింత బలపడింది. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమకు సాక్షిగా ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని(Italy) టస్కనీలో(Tuscany) వీరి వివాహం వైభవంగా జరిగింది.

JR.NTR-Varun Tej Wedding
హీరో వరుణ్ తేజ్(Varun Tej)-హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) ఎనిమిదేళ్ల ప్రేమ పెళ్లితో మరింత బలపడింది. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమకు సాక్షిగా ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని(Italy) టస్కనీలో(Tuscany) వీరి వివాహం వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), పవన్ కల్యాణ్(Pawan kalyan), రామ్‌చరణ్(Allu Arjun), అల్లు అర్జున్(Allu arjun), నితిన్(Nithin) మరికొద్ది మంది ప్రముఖుల సమక్షంలో లావణ్య మెడలో మూడుముళ్లు వేశాడు వరుణ్. అయితే ఈ పెళ్లికి యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR) హాజరుకాకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. తమ వివాహానికి హాజరు కావాలని కోరుతూ ఎన్టీఆర్‌కు వరుణ్-లావణ్య పెళ్లి పత్రిక అందించారు. అయినప్పటికీ ఎన్టీఆర్ వీరి పెళ్లికి హాజరుకాలేదు. అందుకు కారణం ఆయన దేవర(Devara) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటమే! అంతే తప్ప మరో ప్రత్యేకమైన కారణమేమీ లేదు. కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. తను షూటింగ్ ఆపేసి వెళ్తే తన కారణంగా చిత్రయూనిట్ అంతా ఇబ్బందిపడాల్సి వస్తుందని ఎన్టీఆర్ అనుకున్నాడు. అందుకే పెళ్లికి వెళ్లలేకపోయాడు. అయితే నవంబర్ 5వ తేదీన జరిగే రిసెప్షన్‌కు మాత్రం ఎన్టీఆర్‌తో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖులంతా హాజరుకానున్నారు.
