దేవర సినిమా(Devara) కోసం ఎన్టీఆర్‌(NTR) అభిమానులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.

దేవర సినిమా(Devara) కోసం ఎన్టీఆర్‌(NTR) అభిమానులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత ఎన్టీఆర్‌ సోలోగా వస్తున్న సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్‌కు క్షణమొక యుగంలా గడస్తోంది. కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమా సెప్టెంబర్‌ 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడటంతో ఆర్టిస్టులు వరుస ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో జెట్ వేగంతో ప్ర‌మోష‌న్స్‌లో దూసుకుపోతుంది. ఇదిలావుంటే లేటెస్ట్‌గా ఈ సినిమా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఫ‌స్ట్ టైం ఒక‌ సినిమా క‌టౌట్‌ను సముద్రంలో ఏర్పాటు చేశారు. ముంబాయిలోని దాదర్ చౌపట్టి ద‌గ్గ‌ర ఈ క‌టౌట్‌ను(Cutout) ఏర్పాటు చేశారు. వినాయ‌క నిమజ్జనానికి వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు ఇది క‌నిపించ‌నుంది. ఇందుకు సంబంధించిన వీడియోతో పాటు ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌ పాత్రను పోషిస్తున్నాడు.

Eha Tv

Eha Tv

Next Story