మంచు విష్ణు(Manchu vishnu) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప(Kannappa) చిత్రానికి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మంచు ఫ్యామిలీకి(Manchu family) ఇది డ్రీమ్‌ ప్రాజెక్టు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో(ocial media) వైరల్‌ అవుతోంది. కొద్ది రోజుల కిందట న్యూజిలాండ్‌లో(Newzealand) కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది చిత్ర యూనిట్‌! ఇప్పుడు సినిమా రిలీజ్‌ డేట్‌ను టార్గెట్‌ను పెట్టుకుని ముందుకు వెళ్లాలని కన్నప్ప మేకర్స్‌ భావిస్తున్నారట! ఇందులో శివుడు పాత్రను పోషిస్తున్న డార్లింగ్‌ హీరో ప్రభాస్‌(Prabhas) కూడా త్వరలో కన్నప్ప సెట్‌లో ఇవ్వబోతున్నారు.

మంచు విష్ణు(Manchu vishnu) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప(Kannappa) చిత్రానికి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మంచు ఫ్యామిలీకి(Manchu family) ఇది డ్రీమ్‌ ప్రాజెక్టు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో(ocial media) వైరల్‌ అవుతోంది. కొద్ది రోజుల కిందట న్యూజిలాండ్‌లో(Newzealand) కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది చిత్ర యూనిట్‌! ఇప్పుడు సినిమా రిలీజ్‌ డేట్‌ను టార్గెట్‌ను పెట్టుకుని ముందుకు వెళ్లాలని కన్నప్ప మేకర్స్‌ భావిస్తున్నారట! ఇందులో శివుడు పాత్రను పోషిస్తున్న డార్లింగ్‌ హీరో ప్రభాస్‌(Prabhas) కూడా త్వరలో కన్నప్ప సెట్‌లో ఇవ్వబోతున్నారు. కన్నప్ప సినిమా షూటింగ్‌ విషయంలో వేగం పెరిగింది. అనుకున్న సమయంలోనే షెడ్యూల్స్‌ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ అనుకుంటోంది. ఈ దసరా(Dasara) సమయంలో కన్నప్ప చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తోంది. పండుగ రోజుల్లో సినిమా రిలీజ్‌ అయితే మరింత రీచ్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ అనుకుంటోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్న కన్నప్ప కోసం ఈ చిత్రంలో నటిస్తున్న ఇతర భాషల తారలతో కూడా ప్రమోషన్స్‌ కార్యక్రమాలను కూడా సెట్‌ చేయాలని ఆలోచనతో కూడా ఉందట! అయితే ఈ దసర పండుగకే ఎన్టీఆర్‌(Jr NTR) నటిస్తున్న దేవర(Devara) సినిమా, రామ్‌చరణ్‌(Ram charan) నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌(Game changer) సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఇదే సమయంలో మంచు విష్ణు కన్నప్ప కూడా వస్తే పోటీ రంజుగా ఉంటుంది. కాకపోతే థియేటర్ల సమస్య రావచ్చు. నిజానికి దేవర సినిమా ఏప్రిల్‌ 5వ తేదీన విడుదల కావాలి. అయితే ఏప్రిల్‌లో సినిమా వచ్చే అవకాశాలు లేవు. వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. దేవర సినిమా కూడా దసరాకే రావొచ్చు. కన్నప్ప సినిమాలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రభాస్‌ శివుడిగా, నయనతార పార్వతీదేవిగా నటిస్తారని అంటున్నారు కానీ, చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

Updated On 3 Feb 2024 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story