ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ఎన్టీఆర్. ఆస్కార్ వేదిక దగ్గర అరుదైన రికార్డ్ సాధించిన తారక్.. హాలీవుడ్(Hollywood) స్టార్స్ నుంచి అభినందనలు అందుకున్నాడు. ఈక్రమంలో ఆర్ఆర్ఆర్ నుంచి అరుదైన రికార్డ్ లు ఎన్నో సాధిచిన జూనియర్ ఎన్టీఆర్..(Jr NTR) తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు.

తాజాగా బ్రిటన్‌లో పాపులర్‌ అయిన ఏసియన్ వీక్లీ న్యూస్‌ EasternEye 2023కిగాను టాప్‌ 50 ఏసియన్‌ స్టార్స్‌ను(Asian stars) ప్రకటించింది. ఈ జాబితాలో తారక్‌ స్థానాన్ని సంపాదించుకోవడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. తారక్ మాత్రమే కాదు టాలీవుడ్ (Tollywood)అందుకున్నఅరుదైన గౌరవం ఇది.

జూనియర్‌ ఎన్టీఆర్ ఈ జాబితాలో 25వ స్థానంలో నిలిచాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI)నుంచి ఈ జాబితాలో నిలిచిన ఒకే ఒక తెలుగు(Telugu) నటుడిగా అరుదైన ఘనత ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. దాంతో నందమూరి ఫ్యాన్స్ తో పాటు.. టాలీవుడ్ ఆడియన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు అమెరికన్‌ మ్యాగజైన variety ప్రకటించిన 500 అత్యంత ప్రభావశీలుర జాబితాలో చోటు సంపాదించుకున్న తొలి దక్షిణాది(South) నటుడిగా అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకున్నాడు తారక్‌.

ఇక ఇవే కాదు.. ఆస్కార్(Oscar) టైమ్ లో.. ఆస్కార్ వేదిక దగ్గర ఎక్కువగా మాట్లాడుకున్న ప్రభావిత స్టార్ గా ఎన్టీఆర్ అరుదైన రికార్డ్ నుఅందుకున్నారు. ఆతరువాత ఆస్కార్ టీమ్ లో ఎన్టీఆర్ కు ప్లేస్ సాధించడంతో మరో ఘనత ఆయన ఖాతాలో నమోదు అయ్యింది. దీనితో పాటు మరిన్ని ప్రపంచ గౌరవాలు ఆయనసొంతం అయ్యాయి.

Updated On 21 Dec 2023 8:52 AM GMT
Ehatv

Ehatv

Next Story