ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram Charan) హీరోలుగా రాజమౌళి(Rajamouli) రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా(RRR Movie) ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ విదేశాల్లో ఘన విజయాలను అందుకుంది. ఆస్కార్‌ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ట్రిపులార్‌ టీమ్‌ వార్తల్లో నిలిచింది. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌, చాయాగ్రాహకుడు సెంథిల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌లకు ఆహ్వానాలు అందాయి.

ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram Charan) హీరోలుగా రాజమౌళి(Rajamouli) రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా(RRR Movie) ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ విదేశాల్లో ఘన విజయాలను అందుకుంది. ఆస్కార్‌ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ట్రిపులార్‌ టీమ్‌ వార్తల్లో నిలిచింది. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌, చాయాగ్రాహకుడు సెంథిల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌లకు ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్ రాజమౌళి తన ఎక్జయిట్‌మెంట్‌ను నెట్టింట షేర్ చేసుకున్నాడు. ఎన్టీఆర్‌ కూడా ఆనందపడుతున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ కమిటీ నుంచి ఆహ్వానం రావడం పట్ల తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు.

'రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, సెంథిల్ కుమార్, చంద్రబోస్, సాబు సిరిల్, నన్ను అకాడమీ అవార్డ్స్ 2024కి సభ్యులుగా ఆహ్వానించడం RRR కుటుంబ సభ్యులైన మనందరికీ గర్వకారణం. ఈ గొప్ప గౌరవానికి వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మాకు ఈ అత్యంత అరుదైన గౌరవాన్ని అందించినందుకు అకాడమీకి ధన్యవాదాలు. అదేవిధంగా అకాడమీ నుండి ఆహ్వానాలు అందుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని నా సహచర మిత్రుల బృందానికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను’ అని ఓ ప్రకటనలో ఎన్టీఆర్‌ తెలిపారు. ఆస్కార్‌ ప్యానెల్‌లో ఈ ఏడాది 398 మందికి కొత్తగా చోటు కల్పిస్తున్నారు. ఇండియా నుంచి 11 మంది సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.ఈ ఆహ్వానాలు అందిన వారిలో ఆర్‌ఆర్‌ఆర్ టీంతోపాటు లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నం, కరణ్‌జోహార్‌, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌, చైతన్య తమహానే, షానెక్‌ సేన్‌లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఆస్కార్‌ అవార్డుల ఎంపికలో వీరందరికి ఓటు హక్కు ఉంటుంది. ఆస్కార్‌ కమిటీ ఆహ్వానాన్ని అందుకున్న తొలి తెలుగు హీరోలుగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మరో అరుదైన రికార్డును దక్కించుకుని. టాలీవుడ్ రేంజ్‌ను మరోసారి గ్లోబల్‌ ఫిలిం ఇండస్ట్రీకి చాటి చెప్పారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. జాన్వీకపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

Updated On 30 Jun 2023 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story