Jr NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం
జూనియర్ ఎన్టీఆర్‌కు(Jr NTR) రోడ్డు ప్రమాదం(Road accident) జరిగిందన్న వ్యాఖ్యలను ఖండించిన దేవర సినిమా యూనిట్. రెండు రోజుల క్రితం జిమ్(Gym) చేస్తుండగా చేతి మణికట్టుకు మాత్రమే(sprain) గాయమైనట్లు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్. గాయంతోనే సినిమా షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నట్లు సమాచారం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు రూమర్లు(Rumors) వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పుకార్లు పుట్టించారు కొందరు. అయితే దేవర చిత్ర యూనిట్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తూ ఆయన జిమ్ చేస్తున్న సమయంలో మణికట్టుకు గాయమైనట్లు వివరణ ఇచ్చింది
A statement from Jr NTR’s Office :
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 14, 2024
Mr. NTR @tarak9999 has sustained a minor sprain to his left wrist a couple of days ago while working out in the gym. His hand has been immobilised with a cast as a precautionary measure. Despite the injury Mr. NTR has completed the shoot for… pic.twitter.com/FSM3u37SjH