ఈమధ్య రీరిలీజ్ ల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోల ఎవర్ గ్రీన్ సినిమాలన్నీ.. సమయాన్ని బట్టి రీ రిలీజ్ చేస్తూ... మరోసారి కలెక్షన్స్ ను జేబుల్ వేసుకుంటున్నారు మేకర్స్. ఈక్రమంలో ఎన్టీఆర్(NTR), మహేష్, పవన్, లాంటి స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేస్తూ..

ఈమధ్య రీరిలీజ్ ల ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోల ఎవర్ గ్రీన్ సినిమాలన్నీ.. సమయాన్ని బట్టి రీ రిలీజ్ చేస్తూ... మరోసారి కలెక్షన్స్ ను జేబుల్ వేసుకుంటున్నారు మేకర్స్. ఈక్రమంలో ఎన్టీఆర్(NTR), మహేష్, పవన్, లాంటి స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేస్తూ.. సందర్భం ప్రకారం ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు రెండు మూడు..ఇప్పటికే రీ రిలీజ్ అయ్యాయి. హిట్ అయ్యాయి. తాజాగా మరో సినిమా రీరిలీజ్ కు సిద్దం అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. డైరెక్టర్ వి.వి. వినాయక్(V.V vinayak) దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్(Adhurs). ఈసినిమాలో ఎన్టీఆర్ ఒక హీరో అయితే.. సినిమాను సక్సెస్ వైపు నడిపించడంతో బ్రహ్మానందం(Brahmananda) కామెడీ కూడా మేజర్ రోల్ పోషించింది. అందుకే ఈసినిమాకు మరో హీరో బ్రహ్మనందం అని చెప్పవచ్చు. ఇక ఈమూవీ రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

నవంబర్ 18, 2023 న అదుర్స్ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రీ రిలీజ్ కానుంది.అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వల్లభనేని వంశీ, కొడాలి నాని నిర్మించిన ఈ సినిమాలో నయనతార, షీలా లు హీరోయిన్లుగా అలరించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 13 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Updated On 2 Oct 2023 8:09 AM GMT
Ehatv

Ehatv

Next Story