యంగ్‌ రెబల్‌స్టార్‌ , పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌(Prabhas) హీరోగా వస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా కల్కి 2898ఏడీ (Kalki 2898 AD) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. నాగ్‌ అశ్విన్‌(Nag ashwin) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబంధించిన చిన్న అప్‌డేట్‌ కూడా నిమిషాల్లో వైరల్‌ అవుతోంది. అంత క్రేజ్‌ ఉంది ఈ సినిమాకు! లాస్టియర్‌ వచ్చిన సలార్‌ సినిమా హిట్టు కొట్టడంతో ప్రభాస్‌ రేంజ్‌ కూడా అమాంతం పెరిగింది.

యంగ్‌ రెబల్‌స్టార్‌ , పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌(Prabhas) హీరోగా వస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా కల్కి 2898ఏడీ (Kalki 2898 AD) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. నాగ్‌ అశ్విన్‌(Nag ashwin) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబంధించిన చిన్న అప్‌డేట్‌ కూడా నిమిషాల్లో వైరల్‌ అవుతోంది. అంత క్రేజ్‌ ఉంది ఈ సినిమాకు! లాస్టియర్‌ వచ్చిన సలార్‌ సినిమా హిట్టు కొట్టడంతో ప్రభాస్‌ రేంజ్‌ కూడా అమాంతం పెరిగింది. అసలే ప్రభాస్ మార్కెట్ చాలా పెద్దది. ఓ హిట్‌ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో కల్కిపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌(AMitabh bachchan), కమలహాసన్‌(Kamal Haasan), దీపిక పడుకొనె, దిశాపటానీ వంటి స్టార్లు నటిస్తున్నారు. క్యామియో రోల్స్‌లో మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ కూడా కల్కిలో కనిపించనున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.

అయితే ఈ ఇద్దరు హీరోలు తాము నటిస్తున్నది లేనిది ఇప్పటి వరకు చెప్పలేదు. కింగ్‌ ఆఫ్‌ కోథా సినిమా ప్రమోషన్‌ కోసం దుల్కర్‌ సల్మాన్‌ హైదరాబాద్‌కు వచ్చిననప్పుడు కల్కి సినిమా గురించి పలు విషయాలు చెప్పాడు. ఆ సినిమా సెట్స్‌ ఎంతో అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చాడు. కల్కిలో మీరు నటిస్తున్నారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. కానీ ఆయన మాటలను బట్టి చూస్తే కల్కిలో నటిస్తున్నాడనే అనిపిస్తోంది. కల్కి సినిమా చివర్లో వచ్చే కీలకమైన సన్నివేశాలలో జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr NTR), నాచురల్ స్టార్‌ నాని(Nani) కూడా కనిపించబతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కృపాచార్యగా నాని కనిపిస్తే పరశురాముడిగా ఎన్టీఆర్​ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే కల్కిలో ఎంతోమంది ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులు ఉన్నారు. అలాంటిది నాని, తారక్‌ పేర్లు తెరపైకి రావడంతో సినిమా మార్కెట్‌ మరింత పెరిగడం ఖాయం. మే 9వ తేదీన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్‌కీ ఈ తేదీతో ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు మే 9వ తేదీనే రిలీజయ్యాయి. ఘన విజయాలు సాధించాయి. అందుకే కల్కి 2898 ఏడీ సినిమాను కూడా అదే రోజునే విడుదల చేస్తున్నారు.

Updated On 30 Jan 2024 6:39 AM GMT
Ehatv

Ehatv

Next Story