జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) - కొరటాల శివ(Koratala shiva) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర(Devara). ఈమూవీ నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్(First glimpse) రిలీజ్ అయ్యింది. కొంతసేపటి క్రితం గ్లింప్స్ ను రిలీజ్ చేశారు టీమ్. .అదరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ..

Devara Teaser
జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) - కొరటాల శివ(Koratala shiva) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర(Devara). ఈమూవీ నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్(First glimpse) రిలీజ్ అయ్యింది. కొంతసేపటి క్రితం గ్లింప్స్ ను రిలీజ్ చేశారు టీమ్. .అదరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో .. అదరిపోయే ఎంట్రీ సీన్ తో.. గ్లింప్స్ ఫ్యాన్స్ కు కనుల విందు చేశారు. పడవలపై కొంతమంది సముద్రంలోకి వెళ్లడం .. షిప్ ను చుట్టుముట్టి దానిలోని సరుకును కాజేయడం చూపించారు. సముద్రపు దొంగల నేపథ్యంలో సాగే కథగా ఇది కనిపిస్తుంది. ఆ దొంగలతో హీరో పోరాడటం చూపించారు.
ఈ గ్లిమ్స్ తో ఎన్టీఆర్ డైలాగ్ అదరిపోయింది. ఈ సముద్రం చేపలకంటే కత్తులను .. నెత్తురును ఎక్కువగా చూసి ఉంటుంది. అందుకే దీనిని ఎర్రసముద్రం అంటారు' అని తారక్ చెప్పిన డైలాగ్.. సినిమాపై ఇంట్రెస్ట్ ను మరింత పెంచింది. దేవరపై అంచనాలు పెంచే విధంగా ఉంది అప్ డేట్.
ఇక ఈసినిమా లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తుండగా.. యువసుధ ఆర్ట్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్ గా ఉండటం ..చిత్రమైన ఆయుధాలతో ఆయన పోస్టర్స్ పై కనిపిస్తూ ఉండటం ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని పెంచుతోంది. అంతే కాదు జైలర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన తమిళ యువ సంగీత సంచలన అనిరుధ్ ఈసినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ఇక ఈమూవీని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.
