మంచి జోరు మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR).. కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్ లో భారీ స్థాయిలో.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తెరకెక్కుతోంది. ఊర మాస్ లుక్ తో ఎన్టీఆర్ బోమ్మ చూసిన ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేశాయి. పక్కా యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోన్న దేవర సినిమా(Devara Movie)..సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ ల మీద దృష్టి పెట్టిన దర్శకుడు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR), కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవర(Devara Movie). ఈ మూవీ షూటింగ్ కు సబంధించిన తాజా అప్ డేట్ ఒకటి ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

మంచి జోరు మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్ లో భారీ స్థాయిలో.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తెరకెక్కుతోంది. ఊర మాస్ లుక్ తో ఎన్టీఆర్ బోమ్మ చూసిన ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేశాయి. పక్కా యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోన్న దేవర సినిమా..సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ ల మీద దృష్టి పెట్టిన దర్శకుడు.. ఆ పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసేశాడు.

గత రెండు వారాలుగా జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్ ల షూటింగ్ నేటితో పూర్తయింది. ఈ మేరకు మూవీ టీమ్ ఫ్యాన్స్ కు అప్ డేట్ ఇచ్చింది. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ఈ ఫైట్స్ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ లో హీరో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. కాగా, దేవర కోసం కెన్నీ బేట్స్ వంటి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ను కూడా పిలిపించారు. బేట్స్ నేతృత్వంలో పలు థ్రిల్లింగ్ సన్నివేశాలను తెరకెక్కించారు. మోత్తానికి యాక్షన్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు టీమ్.

పక్కా యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోన్న ఈమూవీలో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించబోతున్నాడు కొరటాల. ఈసినిమాలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈసినిమాతో ఆమె సౌత్ ఎంట్రీ..ముఖ్యంగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న దేవర వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2024 ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కానుంది. ఇందులో , సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సాధించిన ఎన్టీఆర్.. ఆస్కార్ విన్నింగ్ తో.. గ్లోబల్ స్టార్ గా మారాడు. దేశ వ్యాప్తంగా తారక్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాదు జపాన్ లో కూడా తారక్ కు క్రేజ్ తో పాటు మార్కెట్ ఏర్పడింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దేవర సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల.మరి ఈసినిమా ఎలాంటిరిజల్డ్ ఇస్తుందో చూడాలి.

Updated On 16 July 2023 12:25 AM GMT
Ehatv

Ehatv

Next Story