ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా దేవర. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారెజ్‌ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక దేవర విషయానికి వస్తే ఇటీవలే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో ఫైటింగ్స్‌ సీన్లను తెరకెక్కించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్న కొత్త షెడ్యూల్‌లో కొంత టాకీ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నారని తెలిసింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా దేవర. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారెజ్‌ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక దేవర విషయానికి వస్తే ఇటీవలే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో ఫైటింగ్స్‌ సీన్లను తెరకెక్కించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్న కొత్త షెడ్యూల్‌లో కొంత టాకీ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నారని తెలిసింది. ఇదిలావుండగా వార్‌-2 చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్‌ చేసుకోబోతున్నారు. నవంబర్‌ నెలాఖరులో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందని సమాచారం. తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌-హృతిక్‌ రోషన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమా కథ గురించి కూడా బాలీవుడ్‌లో ఆసక్తికరమైన సమాచారం బయటికొచ్చింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు చివరకు శత్రువులుగా మారితే వారి మధ్య జరిగే సంఘర్షణ ఎలా ఉంటుందన్నదే ఈ చిత్ర కథాంశమని చెబుతున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

Updated On 18 July 2023 6:41 AM GMT
Ehatv

Ehatv

Next Story