మరో పదిహేను రోజుల్లో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రిలీజ్ కాబోతున్నది. సినిమాపై తారక్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
మరో పదిహేను రోజుల్లో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రిలీజ్ కాబోతున్నది. సినిమాపై తారక్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దర్శకుడు కొరటాల శివ(Koratala Siva)కు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇదే కావడం అందుకు కారణం. ఎన్టీఆర్(NTR)సంగతి వేరే. మొన్న దేవర ట్రైలర్(Devara Trailer) లాంచ్ వేడుకలో నవ్వుతూ కనిపించాడు కానీ లోలోపల తెగ టెన్షన్ పడిపోతున్నాడు. ఈ సినిమా సక్సెస్ కావడం ఎన్టీఆర్‌కు ఎంతో అవసరం. పైగా హిందీ ప్రాంతాలలో సినిమా ఆడి తీరాల్సిన అవసరం ఏర్పడింది.
ఆరేళ్ల తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సోలో సినిమా ఇది! అప్పుడెప్పుడో 2018లో అరవింద సమేత వీరరాఘవ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన సోలో సినిమా ఇదే! మధ్యలో ట్రిపులార్(RRR) వచ్చింది. అందులో రామ్‌చరణ్(Ram Charan)కూడా ఉన్నాడు కాబట్టి సినిమా విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి కుదరదు. పైగా ఆ సినిమాను తీసింది రాజమౌళి(RajaMouli).
క్రెడిట్ అంటూ దక్కితే అది రాజమౌళికే దక్కుతుంది. ఆరేళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి డెఫనెట్‌గా ఎన్టీఆర్ టెన్షన్ పడుతుంటాడు. ఈ ఆరేళ్లలో సినిమా అనేక మార్పులను చూసింది. టెక్నాలజీ పెరిగింది. కొత్త పోకడలను సంతరించుకుంది. ఇలాంటి సమయంలో దేవర వస్తున్నది. అందుకే ఎన్టీఆర్‌కు అంత టెన్షన్.