Allu Arjun : అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిన టీడీపీ ఛానెల్స్
అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), భారతీయ జనతా పార్టీలు(BJP) కూటమి కట్టి పోటీ చేసిన విషయం తెలిసిందే! పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్‌కల్యాణ్(Pawan kalyan) పోటీ చేశారు. ఈ క్రమంలో జబర్దస్త్ టీమ్‌తో పాటు కొందరు టీవీ నటులు కూడా పవన్‌కు ప్రచారం చేయడానికి పిఠాపురం వెళ్లారు.
అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం(TDP), జనసేన(Janasena), భారతీయ జనతా పార్టీలు(BJP) కూటమి కట్టి పోటీ చేసిన విషయం తెలిసిందే! పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్‌కల్యాణ్(Pawan kalyan) పోటీ చేశారు. ఈ క్రమంలో జబర్దస్త్ టీమ్‌తో పాటు కొందరు టీవీ నటులు కూడా పవన్‌కు ప్రచారం చేయడానికి పిఠాపురం వెళ్లారు. ప్రచారం చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి(Chiranjeevi) వెళ్లలేదు కానీ ఆయన భార్య సురేఖ(surekha), కుమారుడు రామ్‌చరణ్(Ram charan), బావమరది అల్లు అరవింద్‌లు(Allu Arvind) వెళ్లారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌లు కూడా ప్రచారం చేశారు. పవన్ గెలుపును వారంతా కాంక్షించారు. అధికారపార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు సినిమా గ్లామర్ లేకుండా పోయింది.
యాంకర్ శ్యామల(anchor shyamala) ఒక్కరే జగన్ పార్టీకి ప్రచారం చేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం నంద్యాల(Nandyala) నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్(congress) తరఫున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్రారెడ్డి(Ravi chandra reddy) కోసం అక్కడికి వెళ్లారు. ఆయనకు ప్రచారం చేశారు. రవి తనకు మంచి మిత్రుడని, నిత్యం ప్రజల్లో ఉండే స్వభావం కలిగిన వాడని, అందరికీ మంచి చేయాలన్న తపన ఉన్నవాడని బన్నీ చెప్పుకొచ్చాడు. రవినే గెలిపించాలని ప్రజలకు విన్నవించుకున్నాడు. అల్లు అర్జున్ ఇలా చెప్పడం తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియాకు కంటగింపుగా మారింది. తెలుగుదేశంపార్టీ అంతగా ఉడుక్కుంటుందో లేదో తెలియదు కానీ టీడీపీ భజన పత్రికలు మాత్రం తెగ ఫీలయ్యాయి. ఇదే సమయంలో నాగబాబు(Nagababu) ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడే అయినా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అన్నది ఆ ట్వీట్ సారాంశం.
ఈ ట్వీట్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసిందిగా ప్రచారం జరుగుతోంది. నాగబాబు కోపంతో చేసిన ఈ ట్వీట్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించేనని అందరికీ అర్థమయ్యింది. తాను జనరల్‌గా చెప్పానే తప్ప అల్లు అర్జున్‌ను ఉద్దేశించి కాదని నాగబాబు అన్నారు. దీంతో సమస్య అక్కడితో సమసిపోయింది. తెలుగుదేశంపార్టీ మీడియా మాత్రం అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది. పనిగట్టుకుని కొంత మంది వ్యక్తులను తీసుకుని వచ్చి బన్నీపై నెగటివ్ కామెంట్స్ చేయిస్తోంది. అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా చర్చలు పెడుతోంది. గంగోత్రిలో ఏ విధంగా ఉన్నావో, ఇప్పుడు ఎలా ఉన్నావో ఒక్కసారి చూసుకో.. నువ్వీ స్థాయిలో ఉండటానికి మెగా ఫ్యామిలీనే కారణం. ఇలాగే బిహేవ్ చేస్తే మళ్లీ గంగోత్రి స్థాయికి వెళ్లిపోతావు అంటూ శాపనార్థాలు పెట్టింది.
అసలు ఇంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా? అల్లు అర్జున్ ఎక్కడా వైసీపీ కండువా వేసుకోలేదు. వైసీపీకి ఓటు వేయండంటూ ప్రజలను అడగలేదు. కేవలం తన స్నేహితుడు రవికి ఓటు వేయండని మాత్రమే అన్నారు. ఇలా చాలా మంది ప్రచారం చేసేవారు ఉన్నారు. విక్టరీ వెంకటేశ్‌నే(Venkatesh) తీసుకోండి. ఆయన ఖమ్మం వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అన్నారు. కైకలూరుకు వెళ్లి బీజేపీ అభ్యర్థికి ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. సినిమా నటులు వారికి ఉన్న సంబంధ బాంధవ్యాల కారణంగా ఆయా అభ్యర్థులకు ఓటు వేయమని అడగడం సర్వ సాధారణం. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, ఇంకా ఆ పార్టీకి రాజీనామా ఇవ్వకుండా చిరంజీవి బీజేపీకి ఓటు వేయమని ఎలా చెబుతారు? మరి చిరంజీవిని ఎవరూ ఎందుకు టార్గెట్ చేయలేదు. టీడీపీ మీడియాకు వెంకటేశ్ టార్గెట్ అవ్వలేదు. చిరంజీవి టార్గెట్ అవ్వలేదు. కేవలం అల్లు అర్జున్ మీదనే విరుచుకుపడుతోంది. ఇంకో విశేషమేమిటంటే పవన్‌ను ఫాలో అవుతున్న కొన్ని ఛానెళ్లు, ఆయన సామాజికవర్గం నడుపుతున్న ఛానెళ్లు కూడా అర్జున్‌ను లైట్ తీసుకున్నాయి. తెలుగుదేశంపార్టీ మీడియా మాత్రం అల్లు అర్జున్ చేయకూడని తప్పు ఒకటి చేసినట్టు తీవ్రంగా విమర్శిస్తోంది. కచ్చితంగా ఇది సరైన పద్దతి కాదు.
మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే,
మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...!— Naga Babu Konidela (@NagaBabuOffl) May 13, 2024