ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం(AP government) అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) సంబంధించిన కొందరు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం(AP government) అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) సంబంధించిన కొందరు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు. సినిమా రంగం నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికిన, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరపున ఎన్నికల ప్రచారం చేసిన , జగన్‌(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేసిన సినీ నటుడు ఆలీ(Actor ali) ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. తాను వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. నిజానికి ఎన్నికల కంటే ముందు ఆలీని రాజ్యసభకు పంపిస్తారంటూ ప్రచారం జరిగింది. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయించబోతున్నారని, అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆలీ రెడీగా ఉన్నారని.. ఇలా రకరకాలుగా చెప్పుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో, జగన్మోహన్‌రెడ్డితో ఆలీ ప్రయాణం చాలా కాలంగా కొనసాగుతూ వచ్చింది. 2019 ఎన్నికలప్పుడు ఆలీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేశారు. ఆ సందర్భంలో పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) ఆయనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి ఆలీ కౌంటర్‌ ఇచ్చారు. ఆ తర్వాత 2024లో కూటమి అధికారంలోకి రావడంతోనే ఆలీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇకపై తనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో సంబంధం లేదంటూ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసే సమయానికి ఆలీ క్యాబినెట్‌ ర్యాంకు పదవిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా సినీ నటుడు, రచయిత , దర్శకుడు పోసాని కృష్ణ(Posani krishna murali) మురళి కూడా రాజకీయాల నుంచి వైదొలిగారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఇక నుంచి తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపైనా, మద్దతుదారులపైనా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. శ్రీరెడ్డి, రామ్‌గోపాల్ వర్మ వంటి వారిపైన కూడా కేసులు పెట్టారు. సినీ రంగానికి చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సానుభూతిపరులపైనా , సోషల్‌ మీడియా వారిపైనా కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని కేసులు పెడుతోంది. ఓ వ్యూహం ప్రకారం వీరిపై కేసులు పెడుతున్నారు. పోసాని కృష్ణమురళిపైన కూడా పలు పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. రేపో మాపో ఆయనను అరెస్ట్ చేస్తారని కొందరు అంటున్నారు. అందుకే కాబోలు పోసాని రాజకీయాలకు గుడ్‌బై చెప్పింది! సినిమా పరిశ్రమ నుంచి జగన్‌కు చాలా చాలా తక్కువ మద్దతు ఉంది. సినిమావాళ్లలో చాలా మంది తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నవారే!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తోపాటు మంత్రి నారా లోకేష్‌ను అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఏపీలో పలు పోలీస్‌స్టేషన్‌లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే గాక, తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలుగుదేశంపార్టీ నాయకులు ఆరోపించారు. పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో పోసాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రకటన చేయడం గమనార్హం.


Eha Tv

Eha Tv

Next Story