ప్రస్తుతం సోషల్ మీడియాతో(Social media) మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోంది. ఈ మాట ఎందుకనాల్సి వస్తున్నదంటే కొందరు బట్జేబాజ్‌గాళ్లు ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలతో(Fake videos) అవతలివారిని బాగా ఇబ్బంది పెడుతున్నారు. వ్యక్తిగత జీవితాలకు ఇబ్బందులు కలగచేస్తూ వారిని మానసికంగా కుంగదీస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాతో(Social media) మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోంది. ఈ మాట ఎందుకనాల్సి వస్తున్నదంటే కొందరు బట్జేబాజ్‌గాళ్లు ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలతో(Fake videos) అవతలివారిని బాగా ఇబ్బంది పెడుతున్నారు. వ్యక్తిగత జీవితాలకు ఇబ్బందులు కలగచేస్తూ వారిని మానసికంగా కుంగదీస్తున్నారు. చాలా మంది సెలెబ్రిటీలు ఇలాంటి చెత్తగాళ్ల బారిన పడి కుమిలిపోతున్నారు. లేటెస్ట్‌గా నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) కూడా ఈ విధమైన సమస్యను ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం రష్మిక మందన్న డీప్ నెక్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో(Deep Black Dress) లిఫ్ట్ లోపల నిలబడి ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అది నిజమో అబద్ధమో తెలియడం లేదు. వీడియోను చూసిన చాలా మంది రష్మికనే అని పొరపాటుపడ్డారు. బహిరంగ ప్రదేశాలలో రష్మిక ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏమిటని అనుకున్నారు. మరీ ఇంత హాట్‌గా ఎందుకు కనిపించాల్సి వచ్చింది అని ఫ్యాన్స్ తమతో తాము ప్రశ్నలు వేసుకున్నారు.
కొందరు బాధపడ్డారు. అయితే ఈ వీడియోలు ఉన్నది రష్మిక కాదని తేలింది. కొందరు సోషల్ మీడియా దుండగులు ఓ డీప్ ఫేక్ వీడియోను రూపొందించి హల్ చల్ చేశారు. ఈ వీడియో పట్ల చాలా మంది తీవ్ర అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్(Amitabh Bachchan) కూడా ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోను క్రియేట్ చేసిన వారిని వదిలిపెట్టకూడదని, పట్టుకుని శిక్షించాలని అన్నారు.
ఈ వీడియో నిజమని కొందరు విశ్వసిస్తున్న సమయంలో జర్నలిస్ట్ అభిషేక్(Journalist abhishek) నిజానిజాలను బయటపెట్టారు. ఈ వీడియోలో ఉన్నది రష్మిక కాదని, ఆమె జరా పటేల్(Jara Patel) అనే యువతి అని స్పష్టం చేశారు. అయితే కొందరు దగుల్బాజీలు రష్మిక ముఖాన్ని ఆమె ముఖంలోకి మార్ఫింగ్ చేసి ఆ వీడియో వైరల్ చేశారు. ఇంతకుముందు కూడా రష్మిక మందన్న ఇలాంటి పొట్టి డ్రెస్‌లో ఉన్న ఫోటోలు, జిమ్ వీడియోలు వైరల్ అయ్యాయి. కొందరు ఒకరినొకరు పోల్చుకుని, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో రష్మికదే అని అనుకున్నారు.
ఈ మేరకు అభిషేక్ సమాచారం అందించారు. రెండు వీడియోలను షేర్ చేసి క్లారిటీ ఇచ్చారు. వైరల్‌గా మారిన ఈ ఫేక్ వీడియోపై రష్మిక అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఈ నీచానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు పోలీసులకు కంప్లయింట్ కూడా చేశారు. రష్మిక మందన్న నటించిన బాలీవుడ్ మూవీ యానిమల్(animal) డిసెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. ఇందులో హీరోగా రణబీర్ కపూర్ నటించారు. ఈ సినిమాలోని ముద్దు సీన్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి.
🚨 There is an urgent need for a legal and regulatory framework to deal with deepfake in India.
You might have seen this viral video of actress Rashmika Mandanna on Instagram. But wait, this is a deepfake video of Zara Patel.
This thread contains the actual video. (1/3) pic.twitter.com/SidP1Xa4sT
— Abhishek (@AbhishekSay) November 5, 2023