జాన్ తన ప్రైవేట్ భాగాలను ఓ పెద్ద నామినేషన్ కవరుతో కప్పేసుకున్నాడు

జాన్ సెనా.. ఒకప్పుడు రెజ్లర్ గా భారతదేశంలో కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇప్పుడు అప్పుడప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో పని చేస్తూ.. సినిమాల్లో స్టార్ గా ఎదిగాడు. ది రాక్ డ్వెన్ జాన్సన్ తర్వాత హాలీవుడ్ లో స్టార్ నటుడిగా జాన్ సెనా ఉన్నాడు. అలాంటి జాన్ ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో న్యూడ్ గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు.

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌ అవార్డును అందించడానికి ఆస్కార్స్‌లో వేదికపైకి జాన్ వచ్చినప్పుడు ఒంటి మీద ఏమీ ధరించలేదు. హోస్ట్ 'జిమ్మీ కిమ్మెల్' వచ్చి.. అవార్డులకు సంబంధించిన నామినీల గురించి, అవార్డు ఎవరిని వరించిందో చెప్పాడు. 1974 అకాడమీ అవార్డ్స్ సమయంలో ఒక స్ట్రీకర్(నగ్నంగా వచ్చే వ్యక్తులు) స్టేజ్ మీదకు పరిగెత్తుకుని వచ్చిన ఒక సంఘటన గురించి కూడా వేదిక మీద పంచుకున్నారు.

జాన్ తన ప్రైవేట్ భాగాలను ఓ పెద్ద నామినేషన్ కవరుతో కప్పేసుకున్నాడు. ప్రేక్షకులందరి నుండి షాకింగ్ రియాక్షన్‌ల మధ్య వేదిక పైకి వచ్చాడు. “కాస్ట్యూమ్స్, అవి చాలా ముఖ్యమైనవి. బహుశా చాలా ముఖ్యమైన విషయమే! ” అంటూ చెప్పడంతో అందరూ నవ్వేశారు. నామినీల పేర్లను చదవడానికి ముందు లైట్లు డిమ్ చేయడంతో.. సహాయకులు వచ్చి.. గౌనును జాన్ కు తొడిగారు. ఆ తర్వాత జాన్ ఈ కేటగిరీ విజేతను ప్రకటించాడు.

Updated On 10 March 2024 10:32 PM GMT
Yagnik

Yagnik

Next Story