జేడీ చక్రవర్తి.. ఈపేరు విని చాలా కాలం అయ్యింది కదా.. ఒకప్పుడు హీరోగా మంచి మంచి సినిమాలు చేసిన జేడీ.. ఆతరువాత సినిమాలు తగ్గించారు. కాని బాలీవుడ్ లో అప్పుడుప్పుడు చేస్తూనేఉన్నారు. తాజాగా ఆయన ఓ రికార్డ్ కూడా సాధించాడు. అటుఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించేందుకు మంచి మంచి సినిమాలు చేసి.. యూతు ను ఆకర్షించేందుకు గులాంబీ లాంటి సినిమాలు చేసి.. అన్ని రకాల ఆడియన్స్ ను మెప్పించిన హీరో జేడీ చక్రవర్తి. టాలీవుడ్ లో ఆయన సినిమాలు చేయక చాలా కాలం అయ్యింది.
జేడీ చక్రవర్తి(JD Chakravarthy).. ఈపేరు విని చాలా కాలం అయ్యింది కదా.. ఒకప్పుడు హీరోగా మంచి మంచి సినిమాలు చేసిన జేడీ.. ఆ తరువాత సినిమాలు తగ్గించారు. కాని బాలీవుడ్(Bollywood) లో అప్పుడుప్పుడు చేస్తూనేఉన్నారు. తాజాగా ఆయన ఓ రికార్డ్ కూడా సాధించాడు.
అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించేందుకు మంచి మంచి సినిమాలు చేసి.. యూతు ను ఆకర్షించేందుకు గులాంబీ లాంటి సినిమాలు చేసి.. అన్ని రకాల ఆడియన్స్ ను మెప్పించిన హీరో జేడీ చక్రవర్తి. టాలీవుడ్(Tollywood) లో ఆయన సినిమాలు చేయక చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం అప్పుడుప్పుడు బాలీవుడ్ సినిమాలు చేస్తూ వెళ్తున్న జేడీ.. తాజాగో ఓ రికార్డ్ కూడా సాధించాడు.
నైజీరియా(Nigeria)లో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'లో మన హీరో జేడీ చక్రవర్తి అవార్డు గెలుచుకున్నారు. టాలీవుడ్ లో జేడీ చక్రవర్తి హీరోగా.. విలన్‌గా.. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇమేజ్ తో బాలీవుడ్ లో కూడా మంచి పాత్రలు చేశాడు. తాజాగా హిందీ సినిమాతో ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'లో అరుదైన అవార్డు లభించింది.
ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ ల్‌లో జేడీ చక్రవర్తికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో అవార్డు వచ్చింది. 'దహిణి ది విచ్' అనే సినిమాలో ఆయన నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఆయనకు అవార్డు లభించింది. దీంతో జేడీ చక్రవర్తిపై సోషల్ మీడియాలో ప్రశంసలు లభిస్తున్నాయి. ఆయననుఅభిమానించే ప్రేక్షకులు కూడా దిల్ ఖుష్ అవుతున్నారు.
ఇంతకుముందు కూడా ఈ సినిమాకి ఎన్నో అవార్డ్ లు లభించాయి. ఇంతకు ముందు ఆస్ట్రేలియాలోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా దహిణి ది విచ్ అవార్డును అందుకుంది. రాజేష్ టచ్‌రివర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా... సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈమూవీని నిర్మించారు. తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు 18 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.