జవాన్ సినిమాతో బాలీవుడ్ లో సందడి చేయబోతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayantara). షారుఖ్(Shah Rukh Khan) సరసన మెరవబోతోంది. ఏజ్ పెరుగుతున్న ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు నయన్ కు. పెళ్ళి తరువాత కూడా ఆఫర్లు తగ్గడంలేదు. రెమ్యూనరేషన్ లో కూడా ఏమాత్రం తగ్గడంలేదు నయనతార. స్టార్ హీరోయిన్లను మించి తీసుకుంటుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ లో లేడి సూపర్‌స్టార్‌ నయనతార ఒక్క షాట్‌లోనే చూపించినా

జవాన్(Jawan) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది నయనతారు. లేడీ సూపర్ స్టార్ పవర్ తెలిసేలా.. ఈమూవీ నుంచి డిఫరెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జవాన్ సినిమాతో బాలీవుడ్ లో సందడి చేయబోతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayantara). షారుఖ్(Shah Rukh Khan) సరసన మెరవబోతోంది. ఏజ్ పెరుగుతున్న ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు నయన్ కు. పెళ్ళి తరువాత కూడా ఆఫర్లు తగ్గడంలేదు. రెమ్యూనరేషన్ లో కూడా ఏమాత్రం తగ్గడంలేదు నయనతార. స్టార్ హీరోయిన్లను మించి తీసుకుంటుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ లో లేడి సూపర్‌స్టార్‌ నయనతార ఒక్క షాట్‌లోనే చూపించినా.. ఆ షాట్‌ తాలుకూ ఇంపాక్ట్‌ బాగానే కనిపించింది. నయన్‌ ఫ్యాన్స్‌ ఒకింత కాస్త నిరాశలో ఉన్నా.. ఆమె పాత్ర వీర లెవల్లో ఉండబోతుందని ఆ ఒక్క షాట్‌తో స్పష్టమయిపోయింది.

ఇక ఈసారి మాత్రం నయనతార కోసం అన్నట్టుగానే.. కొత్త పోస్టర్స్ ను(P0ster) రిలీజ్ చేశారు టీమ్. యాక్షన్‌ మోడ్‌లో ఉన్న నయనతార పిక్‌ను మూవీ టీమ్ రిలీజ్‌ చేసింది. చేతిలో గన్‌ పట్టుకుని అగ్రెసీవ్‌గా ఉన్న నయన్‌ పిక్‌ అదిరిపోయింది. గన్ పట్టుకున్ లేడీ సూపర్ స్టార్ ను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌(Red Chilly Entertainment) బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు కంప్లీట్‌ చేసుకునే పనిలో పడింది. హిందీతో పాటు పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమా సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ కానుంది. అనురుధ్ రవిచంద్రన్‌(Anirudh Ravichandhran) ఈసినిమాకు స్వరాలు అందించగా.. విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక షారుఖ్ విషయానికి వస్తే.. దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత పఠాన్‌(Pathan) సినిమాతో బాలీవుడ్ కు ఊపిరులూదిన బాలీవుడ్ బాద్ షా.. వీర లెవల్ కంబ్యాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం అదే జోష్‌తో జవాన్‌తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇక ఈసినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ప్యాన్స్ లో అంచనాలు పెంచేశాయి. పోస్టర్లు, గ్లింప్స్‌తో ఒక రకమైన క్యూరియాసిటీ పంచేసిన ఈ సినిమా.. ఇరవై నాలుగ్గంటల ముందు రిలీజైన ట్రైలర్‌తో ఊహించిన రేంజ్‌లో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.

ఇక ఈసినిమాలో షారుఖ్ ను మునుపెన్నడూ ఈ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లో చూసి ఉండరు. అలా ప్లాన్ చేస్తున్నార టీమ్. ఇక ఈసినిమాను తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తుండగా.. ఈసారి బాలీవుడ్ లో సెటిల్ అవ్వడమే.. లక్ష్యంగా అట్లీ ప్లాన్ చేస్తున్నాడు.

Updated On 18 July 2023 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story