బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. అందుకే ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆమెకు నోటి దురుసు కూడా ఎక్కువే. ప్రముఖ సినీ రచయిత జావెద్ అక్తర్‌తో(Javed Akhtar) చాలా కాలంగా ఆమెకు వివాదం నడుస్తోంది. 2016లో జావెద్ అక్తర్ తనను ఇంటికి ఆహ్వానించి బెదిరించారని అప్పట్లో కంగన తీవ్ర ఆరోపణలు చేశారు. కంగనా రనౌత్ ఆరోపణలన్నీ అవాస్తవాలని అంటూ ఆమె ఆరోపణలను ఖండించారు జావెద్. ఆమెపై పరువునష్టం దావా కూడా వేశారు.

ఈ నేపథ్యంలోనే లేటెస్ట్‌గా అందేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు(Andheri Metropolitan Magistrate Court) జావెద్ హాజరయ్యారు. ఆనాడు తన నివాసంలో ఏం జరిగిందో న్యాయస్థానానికి తెలిపారు జావెద్. అప్పట్లో హీరో హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌కు మధ్య వివాదం నడిచింది. హృతిక్‌పై కంగన అనేక ఆరోపణలు చేశారు. ఆ ఇద్దరి మధ్య నెలకొన్న వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికే ఆ రోజు ఆమెను ఇంటికి పిలిపించినట్టు జావెద్ అక్తర్ తెలిపారు. 'కంగనతో నాకు పెద్దగా పరిచయం లేదు. నా స్నేహితుడు రమేశ్(Ramesh) అగర్వాల్‌కు కంగన బాగా తెలుసు.
హృతిక్‌తో(Hrithik ROshan) ఆమెకు గొడవలు ఉన్నప్పుడు ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలన్న ఉద్దేశంతో రమేశ్ ఆమెకు ఫోన్ చేసి మా ఇంటికి రమ్మని చెప్పాడు. ఆమె తన సోదరి రంగోలీని తోడు తెచ్చుకుని మా ఇంటికి వచ్చారు. మేము నచ్చజెప్పడానికి ఎంతోగానే ప్రయత్నించాం. కంగన మాత్రం అసలు వినలేదు. తర్వాత ఆమె మా ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆమె మనసుకు ఇబ్బంది కలిగించే మాటలు మేము మాట్లాడలేదు' అని జావెద్ అక్తర్ కోర్టుకు తెలిపారు. చాన్నాళ్ల కిందట హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌లో రిలేషన్‌లో ఉన్నారు. ఏవో కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు.
ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ తనను మోసం చేశాడంటూ కంగన తీవ్ర ఆరోపణలు చేశారు. అటు పిమ్మట వీరి వ్యవహారం కోర్టుకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే 2020లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన .. హృతిక్ రోషన్‌తో గొడవ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే ఇంటర్వ్యూలో జావెద్ అక్తర్ తనను ఇంటికి పిలిపించుకుని బెదిరించారని చెప్పారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై జావెద్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు.