✕
Faria Abdullah : గ్రే కలర్ ఫొటోలతో తనవైపు తిప్పుకుంటున్న చిట్టి..!
By EhatvPublished on 12 May 2023 1:27 AM GMT
ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఈ పేరు చెప్తే గుర్తు రాకపోవచ్చేమోగాని.. చిట్టీ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు ఎవరైనా.. ఎందుకంటే ఆపేరు అంతలా గుర్తింపు తెచ్చింది మరి ఆమెకు. కేవీ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు (Jathi Ratnalu)

x
fariah abdullahh
-
- ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఈ పేరు చెప్తే గుర్తు రాకపోవచ్చేమోగాని.. చిట్టీ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు ఎవరైనా.. ఎందుకంటే ఆపేరు అంతలా గుర్తింపు తెచ్చింది మరి ఆమెకు. కేవీ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు (Jathi Ratnalu) సినిమాలో నవీన్ పొలిశెట్టికి జోడిగా నటించి ప్రేక్షల గుండెల్లో చిట్టిగా మంచి ముద్ర వేసుకుంది ఈ బ్యూటీ. జాతిరత్నాలు సినిమా ఎంతలా ఎంటర్టైన్ చేసిందో మనందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి కెరీర్‌ను బిల్డ్ చేసుకుంది ఈ చిట్టి.
-
- 1998 మే 28న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జన్మించింది. ఈ బ్యూటీ మొదట మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్ అండ్ అలాగే యూట్యూబర్‌గా పలు వీడియోలను క్రియేట్ చేసింది. ఆమె తల్లిదండ్రులు సంజయ్ అబ్దుల్లా, కౌసర్ సుల్తానా. ఫరియా అబ్దుల్లా తన పదవ తరగతి మెరిడియన్ అండ్ భవన్ ఆత్మకూరి రామారావు పాఠశాలలో విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ లయోలా కాలేజీలో మాస్ కమ్యునికేషన్ పూర్తి చేసింది ఈ స్మైలీ బ్యూటీ.
-
- 2021లో జాతిరత్నాలు (Jathi Ratnalu) చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తక్కువ కాలంలోనే మంచి పేరు, గుర్తింపును సంపాదించుకుంది. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచేసుకుంది ఈ భామ. జాతి రత్నాలు హిట్‌ను మరవకముందే అక్కినేని అఖిల్ (Akkineni Akhil) సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది ఈ భామ. ఆ చిత్రంలోనూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
-
- ఆ తర్వాత సంవత్సరంలో అంటే 2022లో ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసేసింది ఫరియా. నాగార్జున (Nagarjuna) నటించిన బంగార్రాజు, సంతోష్ శోభన్‌తో లైక్ షేర్ అండ్ సబ్స్త్క్రైబ్తోపాటు మాస్ మహారాజా రావాణాసుర చిత్రంలో సీనియర్ అడ్వొకేట్ క్యారెక్టర్‌తో తన స్టార్ డమ్ మరింత పెంచేసుకుంది ఈ ఆరగుడుల అమ్మడు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
-
- తాజాగా ఈ అమ్మడు రిలీజ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్ ఉన్న ఈ ఫొటోలను చిట్టి అభిమానులతోపాటు ఇటు నెటిజన్లు లైక్స్తోపాట షేర్ కూడా చేస్తున్నారు. చిట్టి గ్రే కలర్ ఫొటోల్లో కూడా ఇంత క్యూట్‌గా ఉంటుందా అంటూ కమెంట్స్ కూడా చేస్తున్నారు.
-
- ఇక ఫరియా (Faria) ఫ్యాన్స్ మాత్రం ఆమెను ఓ రేంజ్లో పొగిడేస్తున్నారు. చిట్టి (Chitti) తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తుందంటున్నారు. ఇదిలా ఉంటే ఈ భామ ప్రస్తుతం కొన్ని సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు సైన్ చేసింది. ఆ ప్రాజెక్టులు కొన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా మరొకొన్ని సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ బ్యూటీ తక్కువ కాలంలో ఎక్కువ అభిమానులు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 780k ఫాలోవర్లను తన వెంట తిప్పుకుంటోంది ఈ ముస్లిం బ్యూటీ.

Ehatv
Next Story