శ్రీదేవి(Sridevi) కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అందాల తార జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. మంచి నటిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు జాన్వీ కపూర్‌ మత్స్యకన్యగా(mermaid) దర్శనమిచ్చింది.

శ్రీదేవి(Sridevi) కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అందాల తార జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. మంచి నటిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు జాన్వీ కపూర్‌ మత్స్యకన్యగా(mermaid) దర్శనమిచ్చింది. నిజంగా కాదు కానీ ఓ సినిమా ప్రచారం కోసం మత్స్యకన్యగా కనిపించింది జాన్వీకపూర్‌. రాబ్‌ మార్షల్‌(Rob Marshall) డైరెక్షన్‌లో వస్తున్న ది లిటిల్‌ మెర్మేడ్‌(The little mermaid) సినిమా ఈ నెల 26న విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా జాన్వీకపూర్‌ ఓ ప్రత్యేక వీడియోలో కనిపించింది. ఇందులో కొంతమంది పిల్లలతో జాన్వీ మాట్లాడుతూ సడన్‌గా మత్స్యకన్యగా మారిపోతుంది. ఆ తర్వాత సినిమా విడుదల గురించి పిల్లలకు చెబుతుంది. హాలీ బెయిలీ ఈ చిత్రంలో ఏరియల్‌ అనే మత్స్యకన్యగా నటిస్తోంది.

Updated On 20 May 2023 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story