బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్(Janhvi Kapoor) హైదరాబాద్ కు మకా మార్చబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె ఇక్కడే సెటిల్ అవ్వబోతుందా.. ? లేక ఇక్కడికి వచ్చినప్పుడు ఉండటానికి ఇల్లు కొంటుందా..? ఇంటికి ఎంత ఖర్చుపెట్టిందో తెలుసా..?

బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్(Janhvi Kapoor) హైదరాబాద్ కు మకా మార్చబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె ఇక్కడే సెటిల్ అవ్వబోతుందా.. ? లేక ఇక్కడికి వచ్చినప్పుడు ఉండటానికి ఇల్లు కొంటుందా..? ఇంటికి ఎంత ఖర్చుపెట్టిందో తెలుసా..?

దూకుడు మీద ఉంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. వరుస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకుపోతోంది. కమర్షియల్ సినిమాలు కాకుండా.. రొటీన్ కు భిన్నంగా ఆర్ట్ మూవీస్ చేసుకుంటూ... తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను సాధించింది. చాలా తక్కువ టైమ్ లో పాన్ ఇండియా హీరోయిన్ గా మారే అవకాశం వచ్చింది బ్యూటీ. అటు బాలీవుడ్ లో ఓ మార్క్ వేసుకున్న జాన్వీ.. సౌత్ లో మాత్రం కమర్షియల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) జోడీగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్. ప్రస్తుతం దేవర(Devara) సినిమా షూటింగ్ పనులలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమూవీలో చేపలు పట్టే ఫ్యామిలీ అమ్మాయిగా జాన్వీ కపూర్ కనిపించబోతోంది.

దేవర సినిమా రిలీజ్ అవ్వకముందే.. ఆమె ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అటు తమిళం నుంచి.. ఇటు తెలుగులో కూడా ఇంకొంత మంది స్టార్ మేకర్స్ జాన్వీని తమ సినిమాల కోసం బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారట.సౌత్ లో అన్నిభాషల నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయట. ఇప్పటికే దేవర షూటింగ్ కోసం జాన్వీ తరచూ ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లి రావాలి అంటే ఎంతో ఇబ్బంది పడుతుందట. వచ్చిన తరువాత కూడా హోటల్స్ లో ఉండటం కూడా ఇబ్బందిగా ఉంటుందట.

అందుకే ఆమె ఏకంగా హైదరాబాద్ కు మకాం మార్చి.. కొన్నిరోజులు ఇక్కడ.. కొన్ని రోజులు ముంబయ్ లో ఉండేట్టు ప్లాన్ చేస్తుందని సమాచారం.

Updated On 1 Oct 2023 7:03 AM GMT
Ehatv

Ehatv

Next Story