అతిలోకసుందరి శ్రీదేవి(Sri devi) కూతురు జాన్వీ కపూర్(janhvi kapoor) నటిగా తనేమిటో ప్రూవ్ చేసుకుంది. తల్లికి తగిన తనయగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్(NTR) సరసన దేవరలో(Devara) నటిస్తోంది. లేటెస్ట్‌గా హీరో రామ్‌చరణ్(Ram charan) సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యంది.

Janhvi Kapoor
అతిలోకసుందరి శ్రీదేవి(Sri devi) కూతురు జాన్వీ కపూర్(janhvi kapoor) నటిగా తనేమిటో ప్రూవ్ చేసుకుంది. తల్లికి తగిన తనయగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్(NTR) సరసన దేవరలో(Devara) నటిస్తోంది. లేటెస్ట్‌గా హీరో రామ్‌చరణ్(Ram charan) సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్(Boni kapoor) తెలిపారు. బాలీవుడ్‌లో సినిమాలు చేసినా ఆమె ఖాతాలో ఇప్పటి వరకు మెగా హిట్ పడలేదు. ఆ కొరత టాలీవుడ్ తీరుస్తుందనే నమ్మకం ఆమెలో ఉంది. ఎన్టీఆర్‌తో దేవర సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చిన తర్వాత ఆమె జాతకం మారిపోయింది. ఇప్పుడు తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. దేవర విడుదలైన తర్వాత నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూలు కట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదు. బుచ్చిబాబు(Bucchi Babu) దర్శకత్వలో రామ్‌చరణ్ కథానాయకుడిగా వస్తున్న సినిమాలో జాన్వీ కపూరే హీరోయిన్‌గా చేయబోతున్నది. అయితే తెలుగులో ఎంటరీ ఇవ్వడమే ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి పెద్ద హీరోలతో కావడంతో జాన్వీ కపూర్ కొన్ని షరతులు పెడుతున్నారట. దాదాపు మూడు కోట్ల రూపాయల పారితోషికాన్ని అడుగుతున్నారట. తెలుగులో స్టార్ హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనిరేషన్ అది! అంతే కాకుండా తెలుగులో స్టార్ హీరోలతో తప్ప మిగతావారి సరసన నటించకూడదని తీర్మానించేసుకున్నారట! పట్టుమని పది సినిమాలు కూడా లేవు కానీ అప్పుడే ఇన్ని కండిషన్లా ? అని ఆశ్చర్యపోతున్నారు చాలా మంది!
