నటి శ్రీదేవిని(Sridevi) తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ అందాల సుందరిని ఎంతగానో అభిమానించారు. ఆరాధించారు. ఆమె దివికేగి చాలా ఏళ్లవుతోంది. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీకపూర్‌లో(Janhvi Kapoor) శ్రీదేవిని చూసుకుని మురిసిపోతున్నారు ప్రేక్షకులు. అయిదేళ్ల కిందట బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌ వినూత్నమైన కథా చిత్రాలలో నటించింది. ఎన్టీఆర్‌(NTR) హీరోగా వస్తున్న దేవర(Devara) చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ అందాలభామకు తమిళంలోనూ(Tamil) ఆఫర్లు వస్తున్నాయి.

నటి శ్రీదేవిని(Sridevi) తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ అందాల సుందరిని ఎంతగానో అభిమానించారు. ఆరాధించారు. ఆమె దివికేగి చాలా ఏళ్లవుతోంది. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీకపూర్‌లో(Janhvi Kapoor) శ్రీదేవిని చూసుకుని మురిసిపోతున్నారు ప్రేక్షకులు. అయిదేళ్ల కిందట బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌ వినూత్నమైన కథా చిత్రాలలో నటించింది. ఎన్టీఆర్‌(NTR) హీరోగా వస్తున్న దేవర(Devara) చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ అందాలభామకు తమిళంలోనూ(Tamil) ఆఫర్లు వస్తున్నాయి. లవ్‌ టు డే సినిమాతో తమిళనాట మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు నటుడు, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌(Pradeep Ranganathan). ప్రస్తుతం విఘ్నేశ్‌ శివన్‌(Vignesh shivan) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రదీప్‌ రంగనాథన్‌. సైన్స్‌ ఫిక్షన్‌(Science Fiction) రొమాంటిక్‌ కామెండీ కథాంశమిది. మొబైల్‌ ఫోనును ఉపయోగించి టైమ్‌ ట్రావెల్ చేసిన ఓ యువకుడు తన ప్రేమలో ఎలా సక్సెసయ్యాడన్నది సినిమా కథాంశం. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం జాన్వీ కపూర్‌ను సంప్రదించారు. వినూత్నమైన కాన్సెప్ట్ కావడంతో ఆమె కూడా మరే ఆలోచన లేకుండా సినిమాను అంగీకరించింది. విక్కీ -6 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ప్రముఖ నటుడు కమలహాసన్‌ నిర్మిస్తున్నారు.

Updated On 8 July 2023 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story