స్వర్గానికేగిన అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) ముద్దుల కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor).. బాలీవుడ్‌లో భిన్నమైన పాత్రలను పోషిస్తూ, వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు జాన్వీ కపూర్. ఇటీవల ఓటీటీలో రిలీజైన బవాల్(Bawal) సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. చాలా మంది జాన్వీ నటనను మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టాక్‌షోలో పాల్గొన్న జాన్వీ కపూ్ తన తొలి ప్రేమ అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.
స్వర్గానికేగిన అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) ముద్దుల కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor).. బాలీవుడ్‌లో భిన్నమైన పాత్రలను పోషిస్తూ, వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు జాన్వీ కపూర్. ఇటీవల ఓటీటీలో రిలీజైన బవాల్(Bawal) సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. చాలా మంది జాన్వీ నటనను మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టాక్‌షోలో పాల్గొన్న జాన్వీ కపూ్ తన తొలి ప్రేమ అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. కొద్ది కాలంలోనే తమ ప్రేమ బంధం ముగిసిపోవడానికి కారణమేమిటో తెలిపారు. ‘ఏమాత్రం పరిణితి లేని వయసు కావడంతో మేమిద్దరం ఓ కన్ఫ్యూజన్‌లో ఉండేవాళ్లం. ప్రేమలో ఇద్దరం నిజాయితీగా లేమని, అబద్దాలతోనే బంధాన్ని కొనసాగిస్తున్నామని తెలుసుకున్నాం. అదే సమయంలో నా పేరెంట్స్ కూడా చదువు మీద దృష్టి పెట్టాలని గట్టిగా మందలించారు. వారు చెప్పినట్లుగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందని అర్థమైంది. దాంతో ఆ ఆబ్బాయితో తెగతెంపులు చేసుకున్నాను ' అని జాన్వీకపూర్ తెలిపారు. అయితే తాను ప్రేమించిన అబ్బాయి వివరాలు కానీ, ప్రేమలో పడినప్పుడు తన వయసు గురించి కానీ జాన్వీ కపూర్ చెప్పలేదు. ప్రస్తుతం జాన్వీ తెలుగులో ఎన్టీఆర్(NTR) సరసన దేవర(Devara) చిత్రంలో నటిస్తున్నారు.