ఇటీవలకాలంలో స్టార్ కిడ్ అయిన అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ‘ఏజెంట్’ సినిమాతో వచ్చి.. ఇటు ఆడియన్స్ నుంచి అటు క్రిటిక్స్ వరకు విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడటంతో మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర పబ్లిక్ గానే క్షమాపణలు కోరారు. అయితే అఖిల్ నెక్ట్స్ చేయబోయే ప్రాజెక్టు గురించి అప్పుడు డిస్కషన్స్ మొదలయ్యాయి. అయ్యగారి నెక్ట్స్ మూవీ సాహో సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన అనిల్ కుమార్ ( Anil Kumar) దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతుందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Janhvi kapoor new movie with Akhil Akkineni with UV creations
ఇటీవలకాలంలో స్టార్ కిడ్ అయిన అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ‘ఏజెంట్’ సినిమాతో వచ్చి.. ఇటు ఆడియన్స్ నుంచి అటు క్రిటిక్స్ వరకు విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడటంతో మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర పబ్లిక్ గానే క్షమాపణలు కోరారు. అయితే అఖిల్ నెక్ట్స్ చేయబోయే ప్రాజెక్టు గురించి అప్పుడు డిస్కషన్స్ మొదలయ్యాయి. అయ్యగారి నెక్ట్స్ మూవీ సాహో సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన అనిల్ కుమార్ ( Anil Kumar) దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతుందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ( janhvi kapoor) హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30 సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ఈ బ్యూటిఫుల్ స్టార్‌కి ఇప్పుడు తెలుగులో మరో అవకాశం వచ్చింది. అక్కినేని అఖిల్ తన తాజా చిత్రంలో జాన్వీ కపూర్‌ని ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్ అఖిల్‌తో భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ పరిశీలినలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనుందట.
త్వరలోనే దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సినిమాలోనూ హీరోయిన్గా జాన్వీని ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ లెక్కన ఈ బాలీవుడ్ బ్యూటీకి ‘ఎన్టీఆర్30’ సినిమా విడుదలయ్యాక తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది.