బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఎవ్వనుంది. ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో ఈ భామ తన నెక్ట్స్ మూవీ డిటెయిల్స్ అనౌన్స్ చేసింది. కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘ఎన్టీఆర్30’ మూవీలో యంగ్ టైగర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. దీంతో ‘ఎన్టీఆర్30’ చిత్రంలో హీరోయిన్ ఎవరనే సస్పెన్ప్ కు ఇప్పుడు తెరపడింది. జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం […]

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఎవ్వనుంది. ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో ఈ భామ తన నెక్ట్స్ మూవీ డిటెయిల్స్ అనౌన్స్ చేసింది. కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘ఎన్టీఆర్30’ మూవీలో యంగ్ టైగర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది.

దీంతో ‘ఎన్టీఆర్30’ చిత్రంలో హీరోయిన్ ఎవరనే సస్పెన్ప్ కు ఇప్పుడు తెరపడింది. జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురుగా జాన్వీకి స్టార్ స్టేటస్ వచ్చింది. తల్లి శ్రీదేవి సౌత్ కు చెందిన వారు కావడంతో బాలీవుడ్ కంటే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమెను ఎక్కువగా అభిమానిస్తుంది. అయితే ఆమె సినీ ఎంట్రీ కోసం యిట్ వెయిట్ చేశారు.

ఇక 2018లో జాన్వీ తల్లి శ్రీదేవి దురదృష్టకర పరిస్థితుల్లో చనిపోయిన తర్వాత, జాన్వీ ఫస్ట్ బాలీవుడ్ మూవీ ‘ధడక్’ రిలీజయింది. ఈ మూవీ ఆమె సినీ జీవితానికి కిక్ స్టార్ట్ ఇచ్చింది. ఈ మూవీ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. 2020లో వచ్చిన నెట్‏ఫ్లిక్స్‏లో రిలీజైన ‘ఘోస్ట్ స్టోరీస్’తో మంచి అప్లాడ్స్ ఒచ్చాయి. అదే ఇయర్ లో వచ్చిన ‘ది కార్గిల్ గర్ల్’లో గుంజన్ సక్సేనా క్యారెక్టర్ తో జాన్వీ కపూర్ అందరినీ ఆకట్టుకుంది.

తర్వాత వచ్చిన గుడ్ లక్ జెర్రీ, మిలి వంటి చిత్రాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది జాన్వీ కపూర్. కరోనా కారణంగా ఈ అమ్మడు సినిమాలన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‏కు వెళ్లాయి. వాటి తర్వాత రాజ్‏కుమార్ రావు తో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’అనే స్పోర్ట్స్ చిత్రం, వరుణ్ ధావన్‏తో ‘బావాల్’ అనే యాక్షన్ మూవీ చేస్తుంది జాన్వీ కపూర్

ఇన్‏స్టా గ్రామ్‏లో చాలా యాక్టివ్ గా ఉండే జాన్వీ.. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోషూట్లతో ఫోజులు ఇస్తోంది. వాస్తవానికి ఇవి ఆమెను లైమ్‏లైట్‏లో ఉంచాయి అండ్ అలాగే మూవీస్ కంటే ఆమె క్రేజ్‏ను సంపాదించాయి. ఇక ‘ఎన్టీఆర్30’లో నటిస్తున్నట్టు జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్‏లో ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ పోస్టర్‏లో ఆమె చీరకట్టులో కనిపిస్తుంది. ఈ మూవీ షూటింగ్ మార్చి 18న ప్రారంభంకానున్నట్టు సమాచారం.

Updated On 6 March 2023 2:39 AM GMT
Ehatv

Ehatv

Next Story