జాన్వీ కపూర్‌(Janhvi Kapoor).. అందాలతార శ్రీదేవి(Sridevi) కూతురు. ఆమె వారసురాలిగా సినిమాల్లో అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌.. ఎంపిక చేసుకున్న సినిమాలలోనే నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అభిమానులను సొంతం చేసుకుంది. విభిన్నమైన నటనతో బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటిస్తోంది.

జాన్వీ కపూర్‌(Janhvi Kapoor).. అందాలతార శ్రీదేవి(Sridevi) కూతురు. ఆమె వారసురాలిగా సినిమాల్లో అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌.. ఎంపిక చేసుకున్న సినిమాలలోనే నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అభిమానులను సొంతం చేసుకుంది. విభిన్నమైన నటనతో బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటిస్తోంది. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పింది. ఎవరితో నటించాలని మీకు కోరికగా ఉందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'నాకు ఎన్టీఆర్‌తో(NTR) కలిసి నటించాలన్న కోరిక బలంగా ఉండేది. అది దేవర(Devara) సినిమాతో తీరింది' అని చెప్పింది. ఆ లిస్టులో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir kapoor) కూడా ఉన్నాడని తెలిపింది. రణ్‌బీర్‌తో కలిసి నటించే అవకాశం త్వరలో రానున్నట్టు పేర్కొంది. హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, టైగర్‌ ష్రాఫ్‌లతో కలిసి నటించాలని కూడా ఉందని జాన్వీ కపూర్‌ చెప్పింది. ఇక దర్శకుల విషయానికి వస్తే నీరజ్‌ ఘెవాన్‌, సంజయ్‌లీలా బన్సాలీ, కరణ్‌ జోహార్‌లతో పనిచేయాలని ఉన్నట్లు జాన్వీ తన కోరికను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆమె రాజ్‌కుమార్‌ రావ్‌తో కలిసి ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’, ఎన్టీఆర్‌కు జోడీగా ‘దేవర’, ‘ఉలాజ్‌’ చిత్రాల్లో నటిస్తోంది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రానున్న ఓ సినిమాతో తమిళంలో పరిచయం కానున్నట్లు సమాచారం.

Updated On 4 Aug 2023 1:24 AM GMT
Ehatv

Ehatv

Next Story