✕
Janhvi Kapoor : హాట్.. హాట్.. ఫోజులతో మతులు పోగొడుతున్న జాన్వీకపూర్
By EhatvPublished on 8 March 2023 4:37 AM GMT
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఎవ్వనుంది. రీసెంట్గా ఈ భామ తన నెక్ట్స్ మూవీ డిటెయిల్స్ అనౌన్స్ చేసింది. కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘ఎన్టీఆర్30’ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ భామ మార్చి 6న మహారాష్ట్రలో జన్మించింది.

x
Jahnvi Kapoor
-
- బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఎవ్వనుంది. రీసెంట్గా ఈ భామ తన నెక్ట్స్ మూవీ డిటెయిల్స్ అనౌన్స్ చేసింది. కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘ఎన్టీఆర్30’ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ భామ మార్చి 6న మహారాష్ట్రలో జన్మించింది.
-
- అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్. శ్రీదేవి కూతురుగా జాన్వీకి స్టార్ స్టేటస్ వచ్చింది. తల్లి శ్రీదేవి సౌత్ కు చెందిన వారు కావడంతో బాలీవుడ్ కంటే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమెను ఎక్కువగా అభిమానిస్తుంది. అయితే ఆమె సినీ ఎంట్రీ కోసం యిట్ వెయిట్ చేశారు.
-
- ఇక 2018లో జాన్వీ తల్లి శ్రీదేవి చనిపోయిన తర్వాత, జాన్వీ ఫస్ట్ బాలీవుడ్ మూవీ ‘ధడక్’ రిలీజయింది. ఈ మూవీ ఆమె సినీ జీవితానికి కిక్ స్టార్ట్ ఇచ్చింది. ఈ మూవీ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. 2020లో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ‘ఘోస్ట్ స్టోరీస్’తో మంచి అప్లాడ్స్ ఒచ్చాయి.
-
- 2020 ఇయర్ లో వచ్చిన ‘ది కార్గిల్ గర్ల్’లో గుంజన్ సక్సేనా క్యారెక్టర్ తో జాన్వీ కపూర్ అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన గుడ్ లక్ జెర్రీ, మిలి వంటి చిత్రాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఈ హాట్ బ్యూటీ.
-
- కరోనా కారణంగా ఈ అమ్మడు సినిమాలన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌కు వెళ్లాయి. వాటి తర్వాత రాజ్‌కుమార్‌రావు తో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’అనే స్పోర్ట్స్ చిత్రం, వరుణ్ ధావన్‌తో ‘బావాల్’ అనే యాక్షన్ మూవీ చేస్తుంది జాన్వీ కపూర్
-
- ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీపై కొంతకాలం వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈమె ఎవరి సరసన నటిస్తుంది అనే విషయంపై ఊహాగానాలు బాగానే వినిపించాయి. అయితే రీసెంట్ జాన్వీ కపూర్ బర్త్ డే రోజు వాటన్నింటికీ చెక్ పెట్టేసి ఎన్టీఆర్30 లో హీరోయిన్గా చేస్తున్నట్టు అందరినీ సర్ ప్రైజ్ చేసింది ఈ భామ.
-
- ఇదిలా ఉంటే ఎన్టీఆర్30లో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉందని, మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా మూవీ తెరకెక్కబోతుందని టాక్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ బ్యూటీ తన ప్యాన్ ఇండియా సినిమా కోసం 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
-
- ప్రస్తుతం బాలీవుడ్ భామలు భారీ రెమ్యునరేషన్‌తో ప్రాజెక్టులను దక్కించుకుంటున్నారు. సాధారణంగా టాలీవుడ్లో ఒక సినిమాకు తెలుగు టాప్ హీరోయిన్లు 1 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే బాలీవుడ్ భామలు మాత్రం టాలీవుడ్లో ఓ సినిమా చేసేందుకు 3 నుంచి 5 కోట్ల డిమాండ్ చేస్తున్నారట.
-
- ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్2 చిత్రంలో నటించేందుకు కియారా అద్వానీ 4 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక ఇప్పటికే రిలీజైన జాన్వీకపూర్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ ఒస్తోంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.
-
- ఈ మూవీకి మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాను తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో భాషల్లో విడుదల చేయబోతున్నారు.
-
- ఇన్‌స్టా గ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉండే జాన్వీ.. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోషూట్లతో ఫోజులు ఇస్తోంది. వాస్తవానికి ఇవి ఆమెను లైమ్‌లైట్‌లో ఉంచాయి అండ్ అలాగే మూవీస్ కంటే ఆమె క్రేజ్‌ను సంపాదించాయి. ప్రస్తుతం ఈ భామకు ఇన్‌స్టాలో 21.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇప్పటి వరకు 822 పోస్టులు చేసింది ఈ ముద్దుగుమ్మ.

Ehatv
Next Story